Iran-US tensions | అమెరికాను ఓడించేందుకు నేవీ సిద్ధంగా ఉంది : మొజ్తాబా ఖమేనీ
Iran-US tensions | హార్ముజ్ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా బలగాలకు ఎదురు నిలిచేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు. శత్రువులకు మరోసారి పరాజయాన్ని రుచి చూపించేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Iran-US tensions | హార్ముజ్ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా బలగాలకు ఎదురు నిలిచేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు. శత్రువులకు మరోసారి పరాజయాన్ని రుచి చూపించేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికాతో సంబంధాలపై ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుపక్షాల మధ్య పరస్పర అంగీకారం కుదిరే వరకు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిపై ఒత్తిడి తీసుకురావడం, ఇరాన్ పోర్టులపై దిగ్బంధనం విధించడం వంటి చర్యలను తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఇతర దేశాల విధానాలను నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో పరిస్థితి ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బలగాలు ఒక ఆయిల్ ట్యాంకర్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత రెండు భారత జెండా నౌకలు సహా పలు వాణిజ్య నౌకలు మార్గం మార్చుకుని వెనక్కి మళ్లాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి గానీ, నౌకలకు గానీ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఒమన్ తీరానికి సమీపంలో, 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇరాన్‌కు చెందిన రెండు గన్‌బోట్లు ట్యాంకర్‌ను సమీపించి కాల్పులు జరిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇక ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను పునరుద్ధరించినట్లు ఇరాన్ ప్రకటించడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నామని, ఆంక్షలు ఎత్తివేయబడే వరకు నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుమారు పది వాణిజ్య నౌకలు తమ ప్రయాణ మార్గాలను మార్చుకున్నట్లు సమాచారం. వీటిలో భారత జెండా నౌకలు కూడా ఉండటం గమనార్హం. భారీ చమురు లోడుతో ప్రయాణిస్తున్న ఒక సూపర్ ట్యాంకర్ కూడా వెనక్కి తిరిగినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ, నౌకాదళం నిశితంగా గమనిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?






