2030 కి ముందే 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. పుతిన్‌తో కలిసి మోదీ కీలక ప్రకటన
International | Published On Dec 5, 2025, 12.28 pm IST
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్, రష్యా మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ హౌస్ లో ఆతిథ్యం ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్ – రష్యా బిజినెస్ ఫోరమ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ కీలక ప్రకటనలు చేశారు. భారత్, రష్యా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరబోతున్నాయని, ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాలు కూడా గడువు కంటే ముందే సాధించబోతున్నామని మోదీ స్పష్టం చేశారు.
#WATCH | Delhi: At the India-Russia Business Forum, PM Narendra Modi says, "President Putin and I set a goal of exceeding the $100 billion target for bilateral trade by 2030. But from my conversations with President Putin since yesterday, and the potential we see, I don't think… pic.twitter.com/HoipTGTmrj
— ANI (@ANI) December 5, 2025
లక్ష్యం దిశగా..
2030 నాటికి ఇరు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధించాలని నేను, పుతిన్ నిర్దేశించుకున్నాం. నిన్నటి నుంచి జరుగుతున్న చర్చలు, అవకాశాలు చూస్తుంటే 2030 వరకు ఆగాల్సిన అవసరం లేదు. గడుపు కంటే ముందే లక్ష్యాన్ని ఛేదించగలం. వాణిజ్యానికి ఆటంకంగా ఉన్న టారిఫ్స్, ఇతర అడ్డంకులను తొలగిస్తున్నాం.. అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Delhi: At the India-Russia Business Forum, PM Narendra Modi says, "Defence and space have been opened to the private sector. This has created new opportunities in these sectors. Now we are going to open the door to new possibilities in the civil-nuclear sector as well.… pic.twitter.com/0Aqvw6pxWE
— ANI (@ANI) December 5, 2025
పౌర అణుశక్తి రంగంలోకి ప్రైవేట్ సెక్టార్
ఇక దేశ అభివృద్ధి కోసం ప్రైవేట్ భాగస్వామ్యాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన మోదీ సర్కారు పౌర అణుశక్తిని కూడా ప్రైవేట్ సెక్టార్ కి ఇచ్చేందుకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే రక్షణ, అంతరిక్ష రంగాలను ప్రైవేట్ కంపెనీలకు అవకాశాలు ఇచ్చిన కేంద్రం తాజాగా పౌర అణుశక్తి రంగంలోనూ ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశాలు ఇస్తున్నట్టు మోదీ వెల్లడించారు. రిఫార్మ్, ఫర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అనే నినాదంతో భారత్ ముందుకెళ్తోందని.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఇవి దోహదపడతాయని ప్రధాని మోదీ వెల్లడించారు.
#WATCH | Delhi | At India-Russia Business Forum, Russian President Vladimir Putin says, "Russia is interested in participating in the AI summit scheduled to take place in India in February 2026." pic.twitter.com/tAfEmvreLi
— ANI (@ANI) December 5, 2025
ఏఐ సమ్మిట్‌కు రష్యా
ఈ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. 2026 ఫిబ్రవరిలో భారత్‌లో జరగనున్న ఏఐ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రష్యా ఆసక్తిగా ఉందని, టెక్నాలజీ రంగంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






