Mass Shooting | అమెరికాలో కాల్పులు.. 7 ఏండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు (Mass Shooting ) కలకలం సృష్టించాయి. తూర్పు మిసిసిపీలోని (Mississippi) క్లే కౌంటీలో ఓ యువకుడు తన తండ్రి, సోదరుడు సహా ఆరుగురిని దారుణంగా కాల్చి చంపాడు.
International | Published On Jan 11, 2026, 7.20 am IST
త్రినేత్ర.న్యూస్: అమెరికాలో మరోసారి కాల్పులు (Mass Shooting ) కలకలం సృష్టించాయి. తూర్పు మిసిసిపీలోని (Mississippi) క్లే కౌంటీలో ఓ యువకుడు తన తండ్రి, సోదరుడు సహా ఆరుగురిని దారుణంగా కాల్చి చంపాడు. శుక్రవారం రాత్రి (అమెరికా కాలమానం) మూడు వేర్వేరు ప్రాంతాల్లో నిందితుడు కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. ప్రస్తుతం అతడు తమ అదుపులోనే ఉన్నాడని చెప్పారు.
నిందితుడిని 24 ఏండ్ల డేరికా మూర్‌గా (Daricka Moore) గుర్తించామని క్లే కౌంటీ షరీఫ్ ఎడ్డి స్కాట్ తెలిపారు. తొలుత తన తండ్రి, సోదరుడు, అంకుల్‌ను కాల్చి చంపాడని వెల్లడించారు. అనంతరం ఓ ట్రక్కును దొంగిలించి మరో ప్రాంతానికి చేరుకున్నాడని, అక్కడ 7 ఏండ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆమెను తలపై కాల్చి చంపాడాన్నారు. అక్కడి నుంచి మరో ప్రాంతానికి వచ్చి ముగ్గురు పురుషులను చంపాడని తెలిపారు. వారిలో ఒకరు స్థానిక పాస్టర్ ఉన్నారని చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి నిందితుడిని అరెస్టు చేశామన్నారు. అతనిపై హత్య కేసు నమోదుచేశామని, అతని మానసిక స్థితి సరిగ్గానే ఉందని తేలితే మరణ శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.
సంబంధిత వార్తలు

Tariff Refund | అమెరికా టారిఫ్ రీఫండ్ షురూ.. భారత్కు రావల్సిందెంత..?
ఏప్రిల్ 21, 2026

mass shooting | 8 మంది చిన్నారులను కాల్చి చంపిన వ్యక్తి.. మృతుల్లో ఏడుగురు అతడి పిల్లలే
ఏప్రిల్ 20, 2026

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



