త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dimple Hayathi | తాత పెద్ద డైరెక్ట‌ర్ – నాన‌మ్మ హీరోయిన్ – డింపుల్ హ‌య‌తి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గ‌ట్టిదే!

డింపుల్ హ‌య‌తి త‌న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ను బ‌య‌పెట్టింది. తాను దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌న‌వ‌రాలిని అని చెప్పింది. మా నాన‌మ్మ ప్ర‌భ కూడా హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసింది భ‌ర్త మ‌హాశ‌యులు విజ్ఞ‌ప్తి ప్ర‌మోష‌న్స్‌లో డింపుల్ హ‌య‌తి అన్న‌ది.

N

Entertainment | Published On Jan 11, 2026, 3.42 pm IST

Dimple Hayathi | తాత పెద్ద డైరెక్ట‌ర్ – నాన‌మ్మ హీరోయిన్ – డింపుల్ హ‌య‌తి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గ‌ట్టిదే!

సంక్షిప్త సారాంశం

Dimple Hayathi Family Background, Dasari Narayana Rao Granddaughter, Dimple Hayathi Dimple Hayathi Parents Details, Dimple Hayathi Relationship with Actress Prabha , Bhartha Mahasayulaku Wignyapthi Movie

Advertisement

Dimple Hayathi | తెలుగులో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది డింపుల్ హ‌య‌తి. తెలుగులో అభినేత్రి 2, ఖిలాడీ, రామ‌బాణంతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. వీటిలో గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. కానీ ఈ అమ్మ‌డికి అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు. డింపుల్ న‌టించిన ఈ తెలుగు సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ప్ర‌స్తుతం భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తిలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాపై బోలెడు ఆశ‌లు పెట్టుకుంది. ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఈమూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కాబోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన పాట‌లు, ట్రైల‌ర్‌, టీజ‌ర్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న డింపుల్ హ‌య‌తి త‌న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఇంట్రెస్టింగ్‌ విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. డింపుల్ ఫ్యామిలీలో చాలా మందే యాక్ట‌ర్లు ఉన్నార‌ట‌.
"దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న‌కు తాత అవుతార‌ని డింపుల్ అన్న‌ది. మా తాత‌య్య‌కు దాస‌రి క‌జిన్ అవుతారు. అలాగే మా నాన‌మ్మ‌ ప్ర‌భ హీరోయిన్‌గా తెలుగులో చాలానే సినిమాలు చేశారు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో న‌టించారు. మా అమ్మ అక్క‌చెల్లెళ్లు కూడా సినిమా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతోన్నారు. తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తున్నారు" అని చెప్పింది. మా ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియ‌దు. చెప్పుకునే అవ‌స‌రం నాకు పెద్ద‌గా రాలేద‌ని డింపుల్ హ‌య‌తి అన్న‌ది.

కిక్‌లో న‌టించాల్సింది...

ర‌వితేజ కిక్ మూవీతో తాను టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింద‌ని డింపుల్ హ‌య‌తి అన్న‌ది. "కిక్ మూవీలో ర‌వితేజ‌కు త‌ల్లి పాత్ర‌లో మా నాన‌మ్మ ప్ర‌భ న‌టించారు. ఆ సినిమాలో ఇలియానా చెల్లి కోసం యాక్ట‌ర్‌ను వెతుకుతున్నార‌ని తెలిసి నా ఫొటోను డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డికి నాన‌మ్మ చూపించింది. సురేంద‌ర్ రెడ్డి కూడా సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చారు. చ‌దువుకు ఇబ్బంది అని అమ్మ‌నాన్న వ‌ద్ద‌న్నారు. అలా కిక్ సినిమాలో న‌టించే అవ‌కాశం మిస్స‌య్యింది" అని డింపుల్ హ‌య‌తి చెప్పింది. ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు.
భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీలో డింపుల్ హ‌య‌తితో పాటు ఆషికా రంగ‌నాథ్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
ఆ మ‌ధ్య‌కాలంలో తాను బ‌రువు పెరిగినందుకు చాలా మంది ట్రోల్ చేశార‌ని డింపుల్ అన్న‌ది. చాలా క‌ష్ట‌ప‌డి బ‌రువు త‌గ్గాన‌ని అన్న‌ది. ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు ల‌క్ కూడా ఉండాల్సిందేన‌ని చెప్పింది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ మూవీతో పాటు త‌మిళంలో రెండు సినిమాలు చేస్తున్నాన‌ని అన్న‌ది.

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement