త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు : కేటీఆర్

KTR | రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి వెనుకటి రోజులు తెస్తానని.. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ మండిప‌డ్డారు.

S

Telangana | Published On Jan 11, 2026, 3.50 pm IST

KTR | రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి వెనుకటి రోజులు తెస్తానని.. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి ఆనాడు రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి ఒక్కదాన్ని అమలు చేయకుండా విజయవంతంగా తెలంగాణ ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన ప‌లువురు నేత‌లు మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాంద‌రికీ కేటీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌టోళ్ల కార్తీక్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

జాబ్ క్యాలెండ‌ర్‌తో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని, వారు చేస్తున్న ఆందోళనను గౌరవించి వారిని పిలుచుకొని, ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇవ్వాలన్నారు కేటీఆర్. నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని, తూతూ మంత్రంగా కేవలం మీడియా హెడ్‌లైన్ల‌ కోసం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పైన దృష్టి సారించి దాన్ని అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరుసగా దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్ తోపాటు అనేకచోట్ల విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో బట్టల షాపు ప్రారంభోత్సవానికి పోయిన రేవంత్ రెడ్డి పక్కనే గతంలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశమైన గాంధీనగర్‌కి పోలేక పోయిండు అని కేటీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అవి త‌మ‌వే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని… కానీ ఆ అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు అని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి రైతులను రైతు కూలీలను కౌలుదారులను విద్యార్థులను మహిళలను వృద్ధులను ప్రభుత్వ ఉద్యోగులను ఇలా అందరిని మోసం చేశారని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయమని అడిగితే…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నరన్నారు. ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే రేవంత్ రెడ్డి తనకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు రావు కానీ ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతుల భాష అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హామీలను అమలు చేయమన్నందుకు ప్రతిపక్షాలను ప్రజలను ప్రతి ఒక్కరిని బూతులతో తిడుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయమని అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నార‌ని కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తది అని ప్రజలు అనుకుంటున్నారు అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 24 నెలల వైఫల్య పాలనలో.. గత ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు లేకుండా పరిస్థితులు దిగజారిపోయాయి. వ్యాపారాలు తగ్గిపోయాయి. ఉపాధి దొరకకుండా పోయింది. దీనికి సన్నాసి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ అత్యంత నిష్ఠతో పనిచేశారు. నగరంలో పది సంవత్సరాలలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పది సంవత్సరాల కింద హైదరాబాద్‌లో ఉన్న కరెంటు కోతలు, తాగునీటి తిప్పలు, అస్తవ్యస్తపు రోడ్లను హైదరాబాద్ నగర ప్రజలు చూశారు. రాష్ట్రంలో మిషన్ భగీరథతో పాటు హైదరాబాద్, ఇతర పట్టణాల్లో విస్తృతమైన తాగునీటి ప్రాజెక్టులతో తాగునీటి సమస్యలు 90 శాతానికి పైగా పరిష్కరించాము. కరోనా సమయంలోను హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశామ‌ని కేటీఆర్ తెలిపారు.

పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌మని చెప్పుకుంటూ, స్పీకర్ దగ్గర మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్‌లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి. రాజేంద్రనగర్‌కి వచ్చే మెట్రో ఎక్స్‌ప్రెస్‌ను ర‌ద్దు చేసినందుకు సీఎంతోని కలిసి పోయిండా అనే విషయం చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement