త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | బంగారాన్నే కాపాడ‌లేదు.. ధ‌ర్మాన్ని ఎలా కాపాడుతారు..?

Amit Shah | కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌భుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తిరువ‌నంత‌పురంలో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో షా పాల్గొన్నారు. అంత‌కు ముందు ఆయ‌న ప‌ద్మ‌నాభ స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

P

National | Published On Jan 11, 2026, 4.03 pm IST

Amit Shah | బంగారాన్నే కాపాడ‌లేదు.. ధ‌ర్మాన్ని ఎలా కాపాడుతారు..?
Advertisement
  • సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌పై అమిత్ షా విమ‌ర్శ‌లు
  • బంగారం అవ‌క‌త‌వ‌క‌ల కేసును సీబీఐకి ఇవ్వాల‌ని డిమాండ్‌
  • దేశ వ్యతిరేక శక్తుల నుంచి కేర‌ళ‌ను ర‌క్షిస్తామ‌న్న కేంద్ర‌మంత్రి

Amit Shah | కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌భుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తిరువ‌నంత‌పురంలో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో షా పాల్గొన్నారు. అంత‌కు ముందు ఆయ‌న ప‌ద్మ‌నాభ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఇటీవ‌ల స్థానిక మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. 45 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎల్‌డీఎఫ్ ఓట‌మిపాలైంది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇదే త‌మ విజ‌యం కాద‌ని.. ల‌క్ష్యాన్ని సాధించేందుకు ఓ మెట్టుగా పేర్కొన్నారు. కేర‌ళ‌లో క‌మ‌లం గుర్తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి, పార్టీ నేత‌ను ముఖ్య‌మంత్రిగా ఉంచ‌డ‌మే త‌మ అంతిమ‌ల‌క్ష్యంగా పేర్కొన్నారు. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో జ‌రిగిన బంగారం చోరీ కేసును ప్ర‌స్తావిస్తూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

బంగారాన్ని కాపాడలేని వారు.. ధర్మాన్ని ఎలా కాపాడతారు? అంటూ షా ప్ర‌శ్నించారు. ఈ కేసును సీబీఐతో విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేశారు. కేర‌ళ‌ను సంపూర్ణంగా అభివృద్ధి చేయ‌డం, దేశ వ్య‌తిరేక శ‌క్తుల నుంచి ర‌క్షించ‌డంతో పాటు శ‌తాబ్దాలుగా ఉన్న విశ్వాసాన్ని కాపాడ‌ట‌మే ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు ప‌ని చేయ‌లేద‌ని.. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ మాత్రమే అభివృద్ధి చేస్తుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని కేంద్ర‌మంత్రి ధీమా వ్య‌క్తం చేశారు. 2047 నాటికి భార‌త్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల‌ని ప్ర‌ధాని మోదీ క‌లని తెలిపారు. కేరళ భవిష్యత్తుకు మార్గం, అది అభివృద్ధి అయినా, భద్రత అయినా, మన విలువలను కాపాడుకోవడం అయినా ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌తో సాధ్యం కాద‌ని.. బీజేపీతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ప్ర‌పంచంలో చాలా దేశాల్లో క‌మ్యూనిస్ట్ పార్టీలు క‌నుమ‌రుగ‌య్యాయ‌ని, దేశంలో కాంగ్రెస్ పార్టీ కనిపించ‌కుండా పోతుంద‌ని షా చెప్పుకొచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement