Donald Trump | అమెరికా చేసింది ఓకే.. మరి ఇతర దేశాలు కూడా అదే అనుసరిస్తే..?
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా మిలిటరీ బలగాలు భారీ ఆపరేషన్‌ను నిర్వహించి వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆ ఇద్దరినీ ప్రత్యేక విమానంలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రత్యేక డిటెన్షన్ కేంద్రానికి తరలించారు.
International | Published On Jan 4, 2026, 10.20 am IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా మిలిటరీ బలగాలు భారీ ఆపరేషన్‌ను నిర్వహించి వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆ ఇద్దరినీ ప్రత్యేక విమానంలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రత్యేక డిటెన్షన్ కేంద్రానికి తరలించారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తమ చర్యను సమర్థించుకున్నారు. ఇకపై కొంతకాలం పాటు వెనెజువెలాను తామే పరిపాలిస్తామని, మళ్లీ సరైన నాయకత్వం వచ్చాకే వెనెజువెలాను ఆ దేశ పౌరులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అయితే అమెరికా మిత్ర దేశాలు ట్రంప్ చర్యలను ప్రశంసిస్తుండగా, రష్యా, చైనా, క్యూబా, కొలంబియా వంటి శత్రు దేశాలు మాత్రం అమెరికా నిబంధనలను ఉల్లంఘించిందని, అంతర్జాతీయ చట్టాలను అనుసరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త వాదనను పలువురు తెరపైకి తెస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి నిబంధనల ఉల్లంఘన..
ఐక్యరాజ్య సమితి నిబంధనలు, చట్టాల ప్రకారం ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులను మిలిటరీ ఆపరేషన్‌తో అరెస్టు చేయకూడదు. ఇది ఐక్యరాజ్య సమితి చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. 1945 ఐక్యరాజ్య సమితి చార్టర్ లో పొందు పరచబడిన ఆర్టికల్ 2(4) నిబంధనల ప్రకారం మదురో అరెస్టు ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. అంతర్జాతీయంగా అలాంటి చర్యలకు ఉపక్రమించే ముందు మొదటగా ఐక్యరాజ్య సమితిని సంప్రదించాల్సి ఉంటుంది. అలాంటి విషయాలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ముందస్తు సమాచారం అందించాలి. వారు అనుమతి ఇచ్చిన తరువాతే అలాంటి మిలిటరీ ఆపరేషన్‌కు పూనుకోవాలి. కానీ ట్రంప్ మాత్రం ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ముందస్తుగా తెలియజేయలేదని స్పష్టమైంది. పలువురు అంతర్జాతీయ న్యాయ నిపుణులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఈ క్రమంలో ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికా ప్రభుత్వం పూర్తిగా ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లంఘించిందని వారు తెలిపారు. ఇక అమెరికా శత్రు దేశాలు కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తున్నాయి.
ఎవరికీ చెప్పలేదు..
కాగా వెనెజువెలాపై మిలిటరీ ఆపరేషన్‌ను నిర్వహించేందుకు గాను అమెరికా ప్రభుత్వం అక్కడి కాంగ్రెస్ ను కూడా సంప్రదించలేదని తేటతెల్లమైంది. ఈ క్రమంలో ట్రంప్ ఒంటెద్దు పోకడలతోనే ఈ చర్యకు పూనుకున్నాడని స్పష్టమైంది. అయితే మదురో చేసిన నేరాలకు అతన్ని అరెస్టు చేయడం తప్పు కాదని, కానీ అన్ని చట్టాలు, నియమాలను అనుసరించి ఆ పని చేయాల్సిందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా చేయకపోవడం వల్ల ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా అమెరికా లాంటి వైఖరిని అనుసరించే అవకాశం ఉంటుందన్నారు. బలమైన దేశాలు బలహీన దేశాలపై మిలిటరీ చర్యలకు పాల్పడి ఆ దేశ అధ్యక్షులు లేదా ప్రధాని, సైనిక అధ్యక్షుడు వంటి నేతలను అదుపులోకి తీసుకుంటే అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని అంటున్నారు.
ఇతర దేశాలు ఇలాగే చేస్తే..?
ప్రపంచంలో అనేక దేశాల మధ్య పరస్పరంగా అనేక వివాదాలు నెలకొన్నాయి. ఉదాహరణకు చైనా-తైవాన్, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా, భారత్-పాకిస్థాన్.. ఇలా ఆయా దేశాల మధ్య పలు అంశాల్లో ఎప్పటి నుంచో అనేక సమస్యలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాల్లో బలమైన రాజ్యాలు బలహీన దేశాలపై మిలిటరీ చర్యకు పాల్పడే అవకాశం ఉందని, ఆయా దేశాలు అమెరికాను సాకుగా చూపించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కనుక ట్రంప్ ఇలాంటి చర్యలను మానుకోవాలని, చట్ట ప్రకారం వెళ్లాలని సూచించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






