H-1B Visa | హెచ్-1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు పెంపు.. మార్చి నుంచి అమలులోకి.. కొత్త చార్జిలు ఇవే..
H-1B Visa | అమెరికా ప్రభుత్వం భారతీయ ఉద్యోగులు, విద్యార్థులకు చేదువార్త చెప్పింది. హెచ్-1బీ వీసాతోపాటు పలు ఇతర వీసాలు, ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు చెందిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఒక ప్రకటన విడుదల చేసింది.
International | Published On Jan 11, 2026, 10.06 am IST
H-1B Visa | అమెరికా ప్రభుత్వం భారతీయ ఉద్యోగులు, విద్యార్థులకు చేదువార్త చెప్పింది. హెచ్-1బీ వీసాతోపాటు పలు ఇతర వీసాలు, ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు చెందిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఒక ప్రకటన విడుదల చేసింది. పెంచిన ఈ చార్జిలు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా జూన్ 2023 నుండి జూన్ 2025 వరకు నెలకొన్న ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు USCIS తెలిపింది. అయితే పెంచిన ఈ చార్జిల కారణంగా అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు, చదువుకుంటున్న విద్యార్థులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు ఈ ప్రభావాన్ని ఎదుర్కోనున్నారు.
ఫాం I-129 పిటిషన్ల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు..
ఆయా వీసాలకు చెందిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచిన కారణంగా అమెరికాలో పనిచేస్తున్న లేదా చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, నిపుణులు, ఉద్యోగులు విస్తృతంగా ఉపయోగించే కీలకమైన ఉపాధి ఆధారిత, నాన్-ఇమ్మిగ్రెంట్ దరఖాస్తులపై ప్రభావం చూపనున్నాయి. ఇక సవరించిన ఫీజుల ప్రకారం హెచ్-2బీ లేదా ఆర్-1 నాన్-ఇమ్మిగ్రెంట్ హోదా కోసం ఫాం I-129 పిటిషన్ల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుండి 1,780 డాలర్లకి పెరిగింది. అలాగే హెచ్-1బీ, ఎల్-1, ఓ-1, పీ-1, టీఎన్ వీసాలతో సహా అందుబాటులో ఉన్న అన్ని ఇతర ఫాం I-129 విభాగాలకు చెందిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుండి 2,965 డాలర్లకి పెరిగింది.

ఫాం I-140, I-539, I-765 లలోనూ..
అయితే ఉపాధి ఆధారిత విభాగాలలోని విదేశీ కార్మికుల కోసం ఫాం I-140 ఇమ్మిగ్రెంట్ పిటిషన్లకు కూడా ఇదే 2,965 డాలర్ల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని, ఇది గతంలో వసూలు చేసిన 2,805 డాలర్ల కన్నా అధికమని USCIS తెలియజేసింది. కాగా నాన్-ఇమ్మిగ్రెంట్ హోదాను పొడిగించడానికి లేదా మార్చడానికి చేసే కొన్ని దరఖాస్తులకు కూడా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెరగనున్నాయి. ఎఫ్-1, ఎఫ్-2 విద్యార్థులు, జె-1, జె-2 ఎక్స్‌ఛేంజ్ విజిటర్లు, ఎం-1, ఎం-2 వృత్తి విద్యా విద్యార్థులకు సంబంధించిన ఫాం I-539 దరఖాస్తుల కోసం ఫీజును 1,965 డాలర్ల నుండి 2,075 డాలర్లకి పెంచారు. ఇక వేగవంతమైన ఉపాధి అనుమతి కోరుకునే దరఖాస్తుదారుల కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) , STEM-OPT విభాగాలతో సహా ఫాం I-765 దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును 1,685 డాలర్ల నుండి 1,780 డాలర్లకి పెంచారు.
మరింత మెరుగ్గా సేవలు..
కాగా విదేశీ ఉద్యోగులు, విద్యార్థుల నుంచి వసూలు చేసే ఈ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచిన కారణంగా ఆ వచ్చే మొత్తాన్ని ఏజెన్సీల కార్యకలాపాలను మెరుగు పరిచేందుకు ఉపయోగిస్తామని USCIS తెలియజేసింది. ఈ ఫీజులను పెంచడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ సేవలను అందించడానికి, న్యాయ సంబంధ ప్రక్రియలకు, ఇతర పౌర సేవలకు వినియోగిస్తామని పేర్కొంది. అయితే ఈ ఫీజుల పెంపు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, నిపుణులతోపాటు కంపెనీలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1, ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు, OPT దరఖాస్తులలో ఉద్యోగులు, విద్యార్థుల వాటా అధికంగా ఉంది. ఈ క్రమంలోనే వారు ఈ ఫీజుల పెంపు ప్రభావాన్ని ఎదుర్కోనున్నారు. అయితే వేగవంతమైన సేవలు కావాలనుకునే వారికి, ఉద్యోగ మార్పులు అయ్యే వారికి ఈ ఫీజుల పెంపు లాభమే చేకూరుస్తుందని అంటున్నారు. కాగా భారత్ నుంచి హెచ్-1బీ ప్రోగ్రామ్ కింద, ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు బ్యాక్ లాగ్‌లలో ఇప్పటికే భారీ ఎత్తున లబ్ధిదారులు అత్యధికమైన వాటాను కలిగి ఉన్నారు. వారిపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో తెలియనుంది.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!
- ●Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు
- ●Shabad on fire | భగ్గుమన్న షాబాద్.. పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు
- ●Yadagirigutta Temple Board | కొలువుదీరిన యాదగిరిగుట్ట కొత్త బోర్డు

CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి

Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!

Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు






