El Mencho | డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం.. అట్టుడుకుతున్న మెక్సికో నగరాలు
El Mencho | ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ (Mexicos most powerful cartel boss), జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్‌జీ) అధినేత నెమెసియో ఒసెగ్వెరా సెర్వాంటెస్ (Nemesio Oseguera Cervantes) అలియాస్ 'ఎల్ మెంచో' (El Mencho) హతమయ్యాడు.
International | Published On Feb 23, 2026, 10.17 am IST
El Mencho | ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ (Mexicos most powerful cartel boss), జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్‌జీ) అధినేత నెమెసియో ఒసెగ్వెరా సెర్వాంటెస్ (Nemesio Oseguera Cervantes) అలియాస్ 'ఎల్ మెంచో' (El Mencho) హతమయ్యాడు. పశ్చిమ మెక్సికోలోని జలిస్కో (Jalisco) రాష్ట్రం తపాల్పా పట్టణంలో మెక్సికన్ సైన్యం జరిపిన భారీ ఆపరేషన్‌లో అతడు హతమయ్యాడు. ఈ డ్రగ్ మాఫియా డాన్‌ను పట్టుకునే క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మెక్సికో సైన్యం ధృవీకరించింది. అతడి తలపై సుమారు 15 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. అంటే భారత కరెన్సీలో రూ.136.15 కోట్లు.
సైన్యం డేరింగ్ ఆపరేషన్
ఎల్ మెంచో.. మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. తపాల్పా పట్టణం కార్టెల్‌కు కంచుకోట. అలాంటి ప్రాంతంలో ఆపరేషన్ అంటే సాహసంతో కూడుకున్నపనే. అయినా సైన్యం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఆర్మీ, నేషనల్ గార్డ్, వైమానిక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అమెరికా నిఘా సంస్థలు సైతం వీరికి సహకారం అందించాయి. ఈ క్రమంలో ఎల్ మెంచో ఆచూకీని కనిపెట్టిన సైన్యం అదునుచూసి దాడి చేసింది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందాడు. సైనిక చర్యలో ఎల్ మెంచోతో పాటు ఆరుగురు సాయుధ దుండగులు హతం కాగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు.
మెక్సికోలో ఉద్రిక్తత
ఎల్ మెంచో మృతితో మెక్సికోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నాయకుడు మృతి వార్త తెలియగానే సీజేఎన్‌జీ నాయకులు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. వారి ఆందోళనలతో జలిస్కో రాష్ట్రం అట్టుడికిపోయింది. కార్టెల్ ముఠా వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసింది. గ్వాడలజారా (Guadalajara), ప్యూర్టో వల్లార్టా వంటి నగరాల్లో వాహనాలను తగులబెట్టి రోడ్లను బ్లాక్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనేవ ఇమానాశ్రయాలకు పరుగులు తీశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఎవరీ ఎల్ మెంచో..?
ఎల్ మెంచో.. 2009లో జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్ (CJNG) అనే మాదకద్రవ్యాల ముఠాను ఏర్పాటు చేశాడు. గత దశాబ్ద కాలంలో మెక్సికోలో అత్యంత శక్తిమంతమైన డ్రగ్ మాఫియా డాన్‌గా ఎదిగాడు. అమెరికాకు ప్రధాన డ్రగ్స్ అక్రమ రవాణాదారుగా ఎదిగాడు. జాలిస్కో కార్టెల్‌ను అగ్రరాజ్యం ఉగ్ర సంస్థగా పరిగణించింది. మెంచో తలపై 15 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అమెరికాకు భారీగా ఫెంటానిల్, కొకైన్, హెరాయిన్ సరఫరా చేయడంతోపాటు, మెక్సికోలో వేల సంఖ్యలో హత్యలు, బాంబు దాడులకు ఇతనే ప్రధాన కారకుడు.
ఎన్నటికీ సహించబోం.. వైట్ హౌస్
తాజా పరిణామాలపై వైట్‌హౌస్ (White House) స్పందించింది. డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించినట్లు తెలిపింది. ఎల్ మెంచో అమెరికాకు ఫశ్రీంటనిల్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి నార్కో టెర్రరిస్ట్‌లను అమెరికా ఎన్నటికీ సహించబోదని స్పష్టం చేసింది.
అడ్వైజరీ..
ఈ హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా అమెరికా, కెనడా సహా భారత ప్రభుత్వాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. మెక్సికోలోని ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ఇక భారత్ కూడా తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. ఏదైనా సాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. మరోవైపు తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్, కెనడియన్ విమానయాన సంస్థలు మెక్సికోకు నడిపే విమాన సర్వీసులను రద్దు చేశాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






