త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | గ్రీన్‌లాండ్‌, ఇరాన్‌పై ట్రంప్‌ సైనిక చ‌ర్య‌..!

Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత ప‌ని చేశారు. వెనిజులాలో భారీ సైనిక ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఆ దేశ అధ్య‌క్షుడిని గ‌ద్దె దించి ఆ దేశాన్ని త‌మ గుప్పిట్లోకి తీసుకున్నారు. అమెరికా చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

P

International | Published On Jan 11, 2026, 3.35 pm IST

Donald Trump | గ్రీన్‌లాండ్‌, ఇరాన్‌పై ట్రంప్‌ సైనిక చ‌ర్య‌..!
Advertisement
  • సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించిన యూఎస్ ప్రెసిడెంట్!

Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత ప‌ని చేశారు. వెనిజులాలో భారీ సైనిక ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఆ దేశ అధ్య‌క్షుడిని గ‌ద్దె దించి ఆ దేశాన్ని త‌మ గుప్పిట్లోకి తీసుకున్నారు. అమెరికా చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ నెల 3న ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజాల్వ్ కింద యూఎస్ సైన్యం వెనిజులా గ‌డ్డ‌పై దిగి అధ్య‌క్షుడు నికోల‌స్ మ‌దురో, ఆయ‌న భార్య‌ను అరెస్టు చేసి అమెరికాకు త‌ర‌లించింది. తాజాగా ట్రంప్ క‌న్ను గ్రీన్‌లాండ్‌, ఇరాన్‌పై ప‌డింది. ఈ రెండుదేశాల‌పై సైనిక చ‌ర్య‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. డైలీ మెయిల్ నివేదిక ప్ర‌కారం.. ట్రంప్ ఆదివారం సీనియ‌ర్ స్పెష‌ల్ ఫోర్స్ క‌మాండ‌ర్స్‌ను గ్రీన్‌లాండ్‌పై దాడి చేయ‌డానికి సాధ‌మ‌య్యే ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. ఇటీవ‌ల ఇరాన్‌పై సైనిక చ‌ర్య‌ల‌కు ఉన్న అవ‌కాశాల‌ను సైతం ట్రంప్‌కు వివ‌రించిన‌ట్లుగా న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

అయితే, ట్రంప్ ఆదేశాల‌పై అగ్ర సైనిక అధికారుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌ను ప్ర‌శ్నిస్తున్న‌ట్లుగా డైలీ మెయిల్ పేర్కొంది. జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (JSOC)ని ట్రంప్ దాడుల‌కు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ ఆప‌రేష‌న్ చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని, కాంగ్రెస్ మద్దతు లేద‌ని గుర్తు చేస్తున్నారు. గ్రీన్‌లాండ్ విష‌యంలో ప్ర‌ణాళిక‌లు అసంబ‌ద్ధ‌మ‌ని, చట్ట‌విరుద్ధంగా పేర్కొంటున్నారు. ట్రంప్ చ‌ర్య‌లు యూరోపియన్ దేశాల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దారి తీస్తుంద‌ని, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)లో తీవ్ర సంక్షోభానికి దారి తీస్తుందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దాంతో నాటో కూట‌మి ప‌త‌న‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించిన‌ట్లుగా తెలుస్తున్న‌ది.

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌లో సైనిక చ‌ర్య‌ల‌కు ఉన్న అవ‌కాశాల‌ను ట్రంప్‌కు వివ‌రించిన‌ట్లు స‌మాచారం. ట్రంప్‌కు ఇచ్చిన నివేదిక‌లో టెహ్రాన్‌లోని ప‌లు ప్రాంతాల‌ను ల‌క్ష్యంగా దాడులు చేయాల‌ని సూచించిన‌ట్లుగా నివేదిక తెలిపింది. ఇందులో సైనిక స‌దుపాయాలు సైతం ఉన్నాయి. ప్ర‌స్తుతం ఇరాన్‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం నుంచి ఇరాన్‌కు స్వాతంత్య్రం క‌ల్పించేందుకు అవ‌స‌ర‌మైన స‌హాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంద‌ని ట్రంప్ ఆదివారం తెలిపారు. నిర‌స‌నకారుల‌ను చంపితే అమెరికా జోక్యం చేసుకుంటుంద‌ని హెచ్చ‌రించారు. ప‌రిస్థితిని నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement