త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Doomsday Fish | బీచ్‌కు కొట్టుకువ‌చ్చిన డూమ్స్‌డే ఫిష్‌.. యుగాంతానికి సూచ‌నేనా..?

Doomsday Fish | మెక్సికోలోని కాబో సాన్ లూకాస్ బీచ్ వద్ద అత్యంత అరుదుగా కనిపించే ఓర్‌ఫిష్ ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చి ద‌ర్శ‌న‌మిచ్చింది. సాధారణంగా డూమ్స్‌డే ఫిష్ గా పిల‌వ‌బ‌డే ఈ చేపలు బీచ్‌లో రెండు కనిపించడంతో సోషల్ మీడియాలో విప‌రీత‌మైన‌ చర్చ మొదలైంది.

S

Viral news | Published On Mar 10, 2026, 10.46 am IST

Doomsday Fish | బీచ్‌కు కొట్టుకువ‌చ్చిన డూమ్స్‌డే ఫిష్‌.. యుగాంతానికి సూచ‌నేనా..?
Advertisement

Doomsday Fish | మెక్సికోలోని కాబో సాన్ లూకాస్ బీచ్ వద్ద అత్యంత అరుదుగా కనిపించే ఓర్‌ఫిష్ ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చి ద‌ర్శ‌న‌మిచ్చింది. సాధారణంగా డూమ్స్‌డే ఫిష్ గా పిల‌వ‌బ‌డే ఈ చేపలు బీచ్‌లో రెండు కనిపించడంతో సోషల్ మీడియాలో విప‌రీత‌మైన‌ చర్చ మొదలైంది. సుమారు 30 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ అరుదైన సముద్ర గ‌ర్భ‌ జీవులు ప్రకృతి విపత్తులకు ముందు సముద్ర ఉపరితలానికి వస్తాయని జపాన్ జానపద కథల‌లో చెబుతుంటారు. న్యూస్‌వీక్ నివేదిక ప్రకారం.. ఆ బీచ్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌లు దూరంలో ఏదో మెరుస్తున్నట్లు కనిపించడంతో ద‌గ్గ‌రికి వెళ్లి చూశారు. దీంతో వారికి రెండు ఓర్‌ఫిష్‌లు కొట్టుకువ‌చ్చి క‌నిపించాయి. ఇవి స‌ముద్ర‌గ‌ర్భంలో సాధారణంగా సుమారు 3వేల అడుగుల లోతులో నివసిస్తాయి. కానీ ఉప‌రితలంలో జీవించ‌డం వీటికి క‌ష్టంగా ఉంటుంది.

సోషల్ మీడియాలో వైర‌ల్‌..

కాగా ఆ మ‌హిళ‌ల్లో ఒకరైన మోనికా పిట్టెంగర్ ఆ చేప వీడియోను We Love Animals అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో కలిసి పోస్ట్ చేసింది. అది మెరుస్తూ కనిపించింద‌ని, చాలా ప్రకాశంగా ఉంద‌ని ఆమె తెలిపింది. తాము దగ్గరగా చూసినప్పుడు మునుపెన్నడూ చూడని దృశ్యంలా అనిపించింద‌ని, అందుక‌నే చేప‌ను రికార్డు చేశామ‌ని, తాము దీన్ని న‌మ్మ‌లేక‌పోతున్నామ‌ని తెలిపింది. అయితే త‌న సోద‌రికి బాధ‌లో ఉన్న జీవులు అంటే న‌చ్చ‌ద‌ని, అందుక‌నే చేప‌ల‌ను మ‌ళ్లీ స‌ముద్రంలోకి తీసుకెళ్లేందుకు య‌త్నించింద‌ని తెలిపింది.

ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించే ముందు బ‌య‌ట‌కు..

ఓర్‌ఫిష్‌లు సాధారణంగా క్రిల్ అనే సూక్ష్మ సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి సాధారణంగా సముద్ర ఉపరితలానికి చాలా అరుదుగా మాత్రమే వస్తాయి. సముద్రం లోతుల్లో నివసించడం, చాలా అరుదుగా కనిపించడం కారణంగా భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే ముందు ఇవి కనిపిస్తాయని విశ్వాసం ఉంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం చేప‌లు ఇలా క‌నిపించ‌డానికి, ప్రకృతి విపత్తులకు మధ్య ప్రత్యక్షంగా ఎలాంటి సంబందాలు లేవ‌ని బుతున్నారు. అయినప్పటికీ ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. కొందరు దీనిని చెడు జ‌ర‌గ‌బోతుందేమోన‌ని, యుగాంతం సంభ‌విస్తుంద‌ని సూచనగా భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది ప్రకృతిలోని అరుదైన అద్భుత దృశ్యమని అభిప్రాయపడుతున్నారు. అయితే కొంద‌రు మాత్రం అస‌లు ఆ వీడియో నిజ‌మైందేనా, ఎవ‌రైనా వెరిఫై చేశారా.. అని కూడా సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

ఓర్‌ఫిష్‌లు భూకంపాల వంటి భౌగోళిక ప్రకంపనలకు చాలా సున్నితంగా స్పందిస్తాయి. వీటిని డూమ్స్‌డే ఫిష్ అని పిలవడానికి కారణం, ఇవి బీచ్‌లకు కొట్టుకుని రావడం భూకంపాలు లేదా సునామీలు వంటి పెద్ద విపత్తులకు సంకేతంగా భావించడమే.. అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
Advertisement