త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Neal Katyal | ట్రంప్‌కే వ్య‌తిరేకంగా వాదించిన లాయ‌ర్‌.. ఇంత‌కీ ఎవ‌రీ నీల్ క‌త్యాల్..?

Neal Katyal | సుంకాల విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు వ్య‌తిరేకంగా ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు వెలువ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ చారిత్రాత్మక తీర్పు వెనుక అమెరిక‌న్ లాయ‌ర్ (Indian-American Lawyer) నీల్ క‌త్యాల్ (Neal Katyal) కీలక పాత్ర పోషించారు. ఆయ‌న భార‌త సంత‌తికి చెందిన లాయ‌ర్ కావ‌డం విశేషం.

D

International | Published On Feb 21, 2026, 10.35 am IST

Neal Katyal | ట్రంప్‌కే వ్య‌తిరేకంగా వాదించిన లాయ‌ర్‌.. ఇంత‌కీ ఎవ‌రీ నీల్ క‌త్యాల్..?
Advertisement

Neal Katyal | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ ఎదురుదెబ్బ త‌గిలిన విష‌యం తెలిసిందే. ప్రపంచ దేశాల‌పై ట్రంప్‌ విధిస్తున్న దిగుమ‌తి సుంకాల‌ను (Trumps Tariffs) ఆ దేశ సుప్రీంకోర్టు (America Supreme Court) కొట్టివేసింది. ఆ సుంకాలేవీ చెల్ల‌వంటూ తీర్పు వెలువ‌రించింది. అయితే, ఈ చారిత్రాత్మక తీర్పు వెనుక అమెరిక‌న్ లాయ‌ర్ (Indian-American Lawyer) నీల్ క‌త్యాల్ (Neal Katyal) కీలక పాత్ర పోషించారు. ఆయ‌న భార‌త సంత‌తికి చెందిన లాయ‌ర్ కావ‌డం విశేషం.

1977 నాటి అంత‌ర్జాతీయ ఎమ‌ర్జెన్సీ ఎక‌నామిక్ ప‌వ‌ర్స్ యాక్ట్ ఆధారంగా ట్రంప్ ప‌లు దేశాల‌పై ప‌న్నుల మోత మోగించారు. అయితే ఆ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ ట్రంప్‌కు వ్య‌తిరేకంగా కోర్టులో వాద‌న‌లు వినిపించి క‌త్యాల్ విజ‌యం సాధించారు. ఈ తీర్పుపై కత్యాల్ స్పందిస్తూ "అధ్యక్షులు శక్తిమంతులే కావచ్చు.. కానీ మన రాజ్యాంగం అంతకంటే శక్తిమంతమైనది" అని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ఓ మైలురాయిగా నిల‌వ‌నుంద‌ని ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు.

ట్రంప్‌కే వ్య‌తిరేకంగా ఆయ‌న వాద‌న‌లు వినిపించి గెల‌వ‌డం ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. దీంతో ఆయ‌న గురించి ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా తెగ చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న ఎవ‌రు..? అంటూ గూగుల్‌లో వెత‌క‌డం మొద‌లు పెట్టారు. నీల్ కత్యాల్ షికాగోలో జ‌న్మించారు. ఆయ‌న త‌ల్లిదండ్రులు భార‌త్ నుంచి అక్క‌డికి వ‌ల‌స వెళ్లారు. యేలా లా స్కూల్ నుంచి గ్యాడ్యుయేష‌న్ పూర్తి చేసిన‌ క‌త్యాల్‌.. త‌న కెరీర్‌లో ఎక్కువ‌గా రాజ్యాంగ కేసుల‌ను వాదించారు. కెరీర్ తొలినాళ్ల‌లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స్టీఫెన్ బ్రేయ‌ర్ వ‌ద్ద క్ల‌ర్క్‌గా ప‌నిచేశారు. 2010లో అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ద‌గ్గ‌ర తాత్కాలిక సొలిసిట‌ర్ జ‌న‌రల్‌గా చేశారు.

ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం , అప్పిలెంట్ కోర్టుల త‌ర‌ఫున ఆయ‌న అనేక‌ కేసులు వాదించారు. అమెరికా సుప్రీంకోర్టులో సుమారు 50కి పైగా కేసుల‌ను వాదించారు. అంతేకాదు, గ‌తంలోనూ ట్రంప్‌కు వ్య‌తిరేకంగా న్యాయ‌స్థానాల్లో వాదించారు కూడా. మిల్‌బ్యాంక్ ఎల్ఎల్‌పీలో ప్ర‌స్తుతం భాగ‌స్వామిగా ఉన్నారు. జార్జ్‌టౌన్ యూనివ‌ర్సిటీ న్యాయ కేంద్రంలో ప్రొఫెస‌ర్‌గానూ ప‌నిచేస్తున్నారు. ఇంపీచ్‌: ద కేస్ అగేన‌స్ట్ డోనాల్డ్ ట్రంప్ పుస్త‌కాన్ని రాశారు. అమెరికా న్యాయ‌శాఖ అంద‌జేసే అత్యున్న‌త పుర‌స్కార‌మైన ఎడ్మండ్ రాండోల్ఫ్ కూడా ఆయ‌న అందుకున్నారు. 2024, 2025 సంవ‌త్స‌రాల్లో అమెరికాలోని మేటి 200 లాయ‌ర్ల ఫోర్బ్స్ జాబితాలో ఆయ‌న స్థానం దక్కించుకున్నారు.

Advertisement
Advertisement