త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Winter Storm | అమెరికాను వ‌ణికిస్తున్న మంచు తుఫాన్‌ బీభత్సం.. 29 మంది మృతి

Winter Storm | భారీ మంచు తుఫాను (Winter Storm) అమెరికాను వ‌ణికిస్తున్న‌ది. దేశంలోని ద‌క్షిణ‌, ఈశాన్య రాష్ట్రాల‌పై పంజా విసురుతున్న‌ది. భీక‌ర మంచు తుఫాను ధాటికి విద్యుత్ తీగ‌లు తెగిపోవ‌డంతో సుమారు 7.50 ల‌క్ష‌ల‌కుపైగా నివాసాలకు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.

G

International | Published On Jan 27, 2026, 8.08 am IST

Winter Storm | అమెరికాను వ‌ణికిస్తున్న మంచు తుఫాన్‌ బీభత్సం.. 29 మంది మృతి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: భారీ మంచు తుఫాను (Winter Storm) అమెరికాను వ‌ణికిస్తున్న‌ది. దేశంలోని ద‌క్షిణ‌, ఈశాన్య రాష్ట్రాల‌పై పంజా విసురుతున్న‌ది. భీక‌ర మంచు తుఫాను ధాటికి విద్యుత్ తీగ‌లు తెగిపోవ‌డంతో సుమారు 7.50 ల‌క్ష‌ల‌కుపైగా నివాసాలకు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. తుఫాను బీభ‌త్సానికి ఇప్ప‌టివ‌ర‌కు 29 మంది మృతిచెందారు. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 8 మంది మరణించగా, ఒహియో, మ‌సాచుసెట్స్‌లో మంచు తొలగించే వాహనాల కింద పడి ఇద్దరు చ‌నిపోయారు.

ఇక న్యూయార్క్‌, పెన్సిల్వేనియా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తున్న‌ది. పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 31 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద 11 అంగుళాల మేర మంచు కురిసింది. అదేవిధంగా అర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు దాదాపు 2,100 కిలోమీటర్ల మేర ఒక అడుగు కంటే ఎక్కువ మంచు పేరుకుపోయింది. మిసిసిపి, టేనస్సీ రాష్ట్రాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో పరిస్థితి దారుణంగా మారింది. 1994 తర్వాత మిసిసిపిలో సంభవించిన అత్యంత భయంకరమైన మంచు తుఫాను ఇదేనని స్థానిక‌ మీడియా వెల్ల‌డించింది.

మ‌రోవైపు ఇండ్లు, రహదారులపై పేరుకుపోయిన మంచును అధికారులు భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. అతిశీతల గాలుల కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో స్కూళ్లు మూత‌ప‌డ‌గా, ఆక్స్‌ఫ‌ర్డ్‌లోని మిసిసిపి యూనివ‌ర్సిటీలో కూడా త‌ర‌గ‌తులు నిలిచిపోయాయి. భీకర తుపాను వ‌ల్ల రోడ్డు ర‌వాణాపైనే కాకుండా విమానయానం పై కూడా తీవ్ర ప్ర‌భావం ప‌డింది. పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ‍కలిగింది. దేశ‌వ్యాప్తంగా 8 వేల విమానాలు ర‌ద్ద‌య్యాయి. ఇక‌, ఆదివారం ఒక్కరోజే అమెరికాలో దాదాపు స‌గం విమానాలు ర‌ద్ద‌య్యాయి. ఇలా క‌రోనా మహమ్మారి తర్వాత ఒకేరోజు ఇన్ని విమానాలు రద్దు కావడం ఇదే మొదటిసార‌ని విమాన‌యాన సంస్థ సిరియ‌మ్ తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement