త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonam Wangchuk | 26 రోజుల త‌ర్వాత‌.. దీక్ష విర‌మించిన సోన‌మ్ వాంగ్‌చుక్‌

Sonam Wangchuk | ప్ర‌ముఖ విద్యావేత్య‌, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) నిరాహార దీక్ష (Hunger Strike) విరమించారు. గురుగ్రామ్‌లోని మేదాంత ద‌వాఖాన‌లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స‌మ‌క్షంలో త‌న‌ దీక్షను విరమించారు.

G

National | Published On Jul 24, 2026, 7.14 am IST

Sonam Wangchuk | 26 రోజుల త‌ర్వాత‌.. దీక్ష విర‌మించిన సోన‌మ్ వాంగ్‌చుక్‌
Advertisement

Sonam Wangchuk | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌ముఖ విద్యావేత్య‌, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) నిరాహార దీక్ష (Hunger Strike) విరమించారు. గురుగ్రామ్‌లోని మేదాంత ద‌వాఖాన‌లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స‌మ‌క్షంలో త‌న‌ దీక్షను విరమించారు. లేహ్ ల‌డ‌ఖ్ అపెక్స్ బాడీ సీనియ‌ర్ నాయ‌కుల‌తోపాటు వివిధ పార్టీల‌కు చెందిన ఎంపీలు విజ్ఞ‌ప్తి చేయ‌డంతోపాటు కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల అనంత‌రం వాంగ్‌చుక్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి (NEET paper leak) బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలంటూ గత 26 రోజులుగా ఆయ‌న నిరాహార దీక్ష చేస్తున్నారు. గ‌త నెల‌ 28న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ ఆయ‌న దీక్ష ప్రారంభించారు.

దేశంలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకునే అవ‌కాశం ఉండ‌టంతోనే నిరాహార దీక్ష‌ను విర‌మిస్తున్న‌ట్లు వాంగ్‌చుక్ తెలిపారు. శాంతి మాత్ర‌మే త‌న మార్గ‌మ‌ని చెప్పారు. నిర‌స‌న‌కారులు ఎలాంటి రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని, శాంతియుతంగానే పోరాటం సాగించాల‌న్నారు. ఈ పోరాటంలో సహకరించిన అందరికీ, వెన్నంటే ఉన్న త‌న భార్య గీతాంజలికి ధన్యవాదాలు తెలిపారు.

వాంగ్‌చుక్‌ త్వ‌ర‌గా కోలుకోవాలి: ప్ర‌ధాని మోదీ

వాంగ్‌చుక్ దీక్ష విర‌మించ‌డంపై ప్ర‌ధాని మోదీ స్పందించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. భవిష్యత్తులో పేపర్‌ లీకేజీలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శుక్ర‌వారం కేబినేట్‌ భేటీలో కీలక బిల్లు ప్రవేశ పెడ‌తామ‌ని, దానిని సోమ‌వారం పార్ల‌మెంటులో బిల్లు ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని, దానిని ఆమోదింప చేస్తామ‌ని వెల్ల‌డించారు.

 

 

Advertisement
Advertisement