Dharmapuri | దీపాల వెలుగుల్లో కాంతులీనిన నారసింహక్షేత్రం.. ధర్మపురిలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..!
Dharmapuri | కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నవనారసింహక్షేత్రం ధర్మపురిలోని బ్రహ్మపుష్కరిణి (కోనేరు) పంచసహస్ర దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కోనేరు మెట్లపై వెలిగించిన ఐదు వేల దీపాలు పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేశాయి.
Devotional | Published On Nov 24, 2026, 9.50 pm IST
Dharmapuri | కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నవనారసింహక్షేత్రం ధర్మపురిలోని బ్రహ్మపుష్కరిణి (కోనేరు) పంచసహస్ర దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కోనేరు మెట్లపై వెలిగించిన ఐదు వేల దీపాలు పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేశాయి. ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేలపైకి దిగి కోనేరులో కొలువుదీరాయా అన్నట్లుగా దీపాల వెలుగులు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. అజ్ఞానమనే చీకట్లను తొలగించి, జ్ఞానజ్యోతులను వెలిగించే కార్తీక దీపోత్సవం భక్తులకు కనుల పండువగా నిలిచింది.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన పండితులు, అర్చకులు, సిబ్బంది మేళతాళాల నడుమ బ్రహ్మపుష్కరిణి వద్దకు చేరుకున్నారు. కోనేరు మధ్యలోని మండపంలో స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తొలి దీపాన్ని వెలిగించి దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలు, అర్చకుల ప్రత్యేక పూజల నడుమ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. కోనేరు మెట్లపై వరుస క్రమంలో ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు ఒక్కొక్కటిగా వెలిగించడంతో కొద్దిసేపటికే పుష్కరిణి మొత్తం దీపకాంతులతో ప్రకాశించింది.

మెట్టుమెట్టునా వెలిగిన దీపాలు, నీటిపై ప్రతిబింబించిన జ్యోతుల వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోనేరు చుట్టూ దీపాల వరుసలు జ్యోతి తోరణాలుగా మారడంతో అక్కడి దృశ్యం అపురూపంగా కనిపించింది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీపాల వెలుగుల మధ్య బ్రహ్మపుష్కరిణి సరికొత్త శోభను సంతరించుకోవడంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ సంకటాల శ్రీనివాస్, పలువురు నాయకులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dev Deepawali 2026 Varanasi | దేవ్ దీపావళి శోభతో మెరిసిపోతున్న కాశీ.. 84 ఘాట్లలో 11 లక్షల దీపాల వెలుగులు, డ్రోన్ షో అదుర్స్!
- ●Revanth Reddy Musi Riverfront Review | మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. ప్రాజెక్టుల డెడ్లైన్లు ఇవే!
- ●Hyderabad Traffic Diversions | హైదరాబాద్ వాసులకు బిగ్ ట్రాఫిక్ అలర్ట్.. రేపు ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోతారు! ప్రత్యామ్నాయ మార్గాలివే..!
- ●Anbil Avan Review | ఎమ్మెల్యే ఫ్లెక్సీ చింపి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జంట - కన్నప్ప హీరోయిన్ తమిళ మూవీ ఎలా ఉందంటే?
- ●Supreme Court | కునో, ఉజ్జయినిలో సఫారీల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ●Hyderabad Bomb Threat Email | హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం.. దర్యాప్తులో జపాన్ వెబ్సైట్, వీపీఎన్ లింకులు

Dev Deepawali 2026 Varanasi | దేవ్ దీపావళి శోభతో మెరిసిపోతున్న కాశీ.. 84 ఘాట్లలో 11 లక్షల దీపాల వెలుగులు, డ్రోన్ షో అదుర్స్!

Revanth Reddy Musi Riverfront Review | మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. ప్రాజెక్టుల డెడ్లైన్లు ఇవే!

Hyderabad Traffic Diversions | హైదరాబాద్ వాసులకు బిగ్ ట్రాఫిక్ అలర్ట్.. రేపు ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోతారు! ప్రత్యామ్నాయ మార్గాలివే..!

Anbil Avan Review | ఎమ్మెల్యే ఫ్లెక్సీ చింపి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జంట - కన్నప్ప హీరోయిన్ తమిళ మూవీ ఎలా ఉందంటే?





