Fire Accident | ఫర్నీచర్ దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Fire Accident | హైదరాబాద్‌లోని చందానగర్‌లో (Chanda Nagar) ఉన్న ఓ ఫర్నీచర్ దుకాణంలో (Fire Accident) భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఫర్నీచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని చందానగర్‌లో (Chanda Nagar) ఉన్న ఓ ఫర్నీచర్ దుకాణంలో (Fire Accident) భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఫర్నీచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్ మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలల ఎగసిపడ్డాయి.. దుకాణంలోని ఐదు అంతస్తుల్లో ఉన్న ఫర్నీచర్ మొత్తం కాలిబూడిదైంది. మంటలు పక్కనే నిర్మాణంలో ఉన్న భవనానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. 7 అగ్నిమాపక యంత్రాలు, 11 వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
భవనంలో సోఫాలు, బెడ్‌లు, టేబుల్స్ వంటి కాలే స్వభావం ఉన్న ఫర్నీచర్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తున్నది. మంటలు అంటుకోవడానికి షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ లేదా ఇతర కారణాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు.
కాగా, రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందని బాలానగర్ ఏసీపీ తెలిపారు. అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్ సమన్వయంతో ప్రమాదాన్ని తగ్గించగలిమాన్నారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా కట్టడి చేశామని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో ఆస్తినష్టం అంచనా వేస్తున్నామన్నారు.
ఇవికూడా చదవండి..
16 నుంచి వారం రోజులపాటు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
నేను కృష్ణ అభిమానిని.. లారీ ఎక్కి వనపర్తికి వెళ్లి సినిమాలు చూసేవాడిని : రేవంత్ రెడ్డి
తాజావార్తలు
- ●Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి
- ●BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
- ●Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
- ●Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!
- ●Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!

Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి

BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!






