త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Knack Packaging IPO | న్యాక్ ప్యాకేజింగ్ సంస్థ ఐపీవోకు సిద్ధం.. రూ.440 కోట్ల ఇష్యూ.. ఎప్పుడంటే..

Knack Packaging IPO | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం దిశ‌గా కీలక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న నేప‌థ్యంలో ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్ క‌నిపిస్తోంది. అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌తోపాటు దేశీయ సూచీలు సైతం లాభాల్లో కొన‌సాగుతున్నాయి. ఇక ఇదే క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు వేచి చూసిన అనేక కంపెనీలు ఎట్ట‌కేల‌కు ఐపీఓల‌ను ఇష్యూ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

S

Business | Published On Jun 24, 2026, 5.22 pm IST

Knack Packaging IPO | న్యాక్ ప్యాకేజింగ్ సంస్థ ఐపీవోకు సిద్ధం.. రూ.440 కోట్ల ఇష్యూ.. ఎప్పుడంటే..
Advertisement

Knack Packaging IPO | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం దిశ‌గా కీలక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న నేప‌థ్యంలో ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్ క‌నిపిస్తోంది. అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌తోపాటు దేశీయ సూచీలు సైతం లాభాల్లో కొన‌సాగుతున్నాయి. ఇక ఇదే క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు వేచి చూసిన అనేక కంపెనీలు ఎట్ట‌కేల‌కు ఐపీఓల‌ను ఇష్యూ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. తాజాగా ప్యాకేజింగ్ సొల్యూష‌న్స్ ప్రొవైడ‌ర్ న్యాక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ ఐపీఓను ఇష్యూ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. జూలై 1న విడుద‌ల కానున్న ఈ ఐపీఓ ద్వారా కంపెనీ దాదాపు రూ.440 కోట్ల‌ను స‌మీక‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది. ఇందులో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.161 నుంచి రూ.170 ప్రైస్ బ్యాండ్ మ‌ధ్య విక్ర‌యించ‌నుంది. రూ.2,080 కోట్ల మార్కెట్ విలువ‌తో కంపెనీ ఐపీవోకు వ‌స్తుండ‌గా, ఒక రోజు ముందుగానే, అంటే జూన్ 30న యాంక‌ర్ ఇన్వెస్ట‌ర్ల‌కు బిడ్డింగ్ విండో ఓపెన్ కానుంది.

88 షేర్ల‌కు లాట్‌, ధ‌ర రూ.14,960..

ఈ ఐపీవోలో భాగంగా ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.380 కోట్ల విలువైన షేర్ల‌ను, ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ ద్వారా రూ.59.5 కోట్ల విలువైన షేర్ల‌ను విక్ర‌యించ‌నున్నారు. రెండూ క‌లిపి మొత్తం రూ.439.5 కోట్ల‌ను ప‌బ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ స‌మీక‌రించ‌నుంది. ఇన్వెస్ట‌ర్లు ఒక బిడ్‌కు క‌నీసం 88 షేర్ల‌ను ఒక లాట్ రూపంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే షేర్ గ‌రిష్ట ధ‌ర వ‌ద్ద రూ.14,960 పెట్టుబ‌డి పెట్టాల్సి వ‌స్తుంది. ఇష్యూలో స‌గ‌భాగం షేర్ల‌ను క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూష‌న‌ల్ బ‌య్య‌ర్స్‌కు, 15 శాతం షేర్ల‌ను నాన్ ఇనిస్టిట్యూష‌న‌ల్ ఇన్వెస్ట‌ర్ల‌కు, 35 శాతం షేర్ల‌ను రిటెయిల్ ఇన్వెస్ట‌ర్ల‌కు కేటాయించారు. కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో జూలై 8న లిస్టింగ్ కానుండ‌గా, సిస్ట‌మాటిక్స్ కార్పొరేట్ స‌ర్వీసెస్‌, ఐడీబీఐ క్యాపిట‌ల్‌, పాంటోమ్యాథ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ ఐపీవో లీడ్ మేనేజ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజా షేర్ల ద్వారా సేక‌రించిన నిధుల‌ను కొత్త త‌యారీ కేంద్రాల మౌలిక స‌దుపాయాల‌కు వినియోగించ‌నున్న‌ట్లు కంపెనీ తెలిపింది. మిగిలిన మొత్తాన్ని కంపెనీ కార్య‌క‌లాపాల‌కు ఉప‌యోగించ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది.

జూలై 3 వ‌ర‌కు..

న్యాక్ ప్యాకేజింగ్ కంపెనీ అహ్మ‌దాబాద్ కేంద్రంగా ప్రింటెడ్‌, లామినేటెడ్ వోవెన్ పాలిప్రొఫైలిన్ (పీఎల్‌డబ్ల్యూపీపీ) బ్యాగ్స్ ను త‌యారు చేస్తుంది. అలాగే పింట్ బాట‌మ్ బ్యాగుల‌ను కూడా ఉత్ప‌త్తి చేస్తుంది. జూలై 1న ప్రారంభం కానున్న ఈ ఐపీవో జూలై 3 వ‌ర‌కు ఉంటుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల‌లో ఈ స్టాక్ లిస్టింగ్ కానుంది. అయితే ఈ స్టాక్‌కు చెందిన గ్రే మార్కెట్ ప్రీమియం వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు రిస్క్‌తో కూడిన పెట్టుబ‌డిగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని, అవ‌స‌రం అయితే నిపుణుల స‌ల‌హా తీసుకోవాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement