త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | రామ్ చ‌ర‌ణ్‌పై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన చిరంజీవి

Chiranjeevi | రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) న్యూ ఏజ్ మెగాస్టార్ (Chiranjeevi) అంటూ ప్ర‌శంసించ‌డంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సంతోషం వ్య‌క్తం చేశారు. కొడుకు పుట్టగానే తండ్రికి నిజమైన సంతోషం కలగదని, సమాజంలో ఆ కొడుకు గొప్పతనాన్ని చూసి జనాలు మెచ్చుకున్నప్పుడే ఆ తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని చెప్పుకొచ్చారు.

D

Entertainment | Published On Jun 24, 2026, 4.40 pm IST

Chiranjeevi | రామ్ చ‌ర‌ణ్‌పై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన చిరంజీవి
Advertisement

Chiranjeevi | రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) న్యూ ఏజ్ మెగాస్టార్ (Chiranjeevi) అంటూ ప్ర‌శంసించ‌డంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అంటూ సుమ‌తీ శ‌త‌కాన్ని గుర్తు చేస్తూ మోదీతో చ‌ర‌ణ్ క‌లిసి ఉన్న ఫొటోల‌ను పంచుకున్నారు.

“నిన్న జ‌రిగిన రిప‌బ్లిక్ టీవీ కార్య‌క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంబోధించ‌డం నాకు ఎంతో ఆనందాన్ని క‌లిగించింది. ఇలాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క వేదిక‌ల‌పై చ‌ర‌ణ్‌కు ల‌భిస్తున్న గుర్తింపు, గౌర‌వం చూస్తుంటే ఒక తండ్రిగా గ‌ర్వంగా ఉంది. త‌న కృషి, అంకిత‌భావం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల అభిమానాన్ని మాత్ర‌మేకాదు, దేశ‌వ్యాప్తంగా విశేష‌మైన గుర్తింపును కూడా సంపాదించుకోవ‌డం నిజంగా సంతోష‌క‌రం. ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని మెగాస్టార్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.

Advertisement
Advertisement