Ponnam Prabhakar | యూరియా సరఫరా కేంద్రం బాధ్యతనే.. లేదంటే బరాబర్ కొట్లాడుతాం : మంత్రి పొన్నం
Ponnam Prabhakar | రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియా సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సకాలంలో ఎరువుల సరఫరా చేయకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు కూర్చుంటామని హెచ్చరించారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియా సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సకాలంలో ఎరువుల సరఫరా చేయకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు కూర్చుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదని, కేంద్రంతో మిత్రపక్షంగా లేమని వివక్ష చూపుతున్నారని పొన్నం పేర్కొన్నారు. గాంధీ భవన్‌లోని ప్రజా సమస్యలపై ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా పొన్నం పలు అంశాలపై మాట్లాడారు.
గతంలో రేషన్ కార్డులు కావాలని వేలాది అప్లికేషన్లు వచ్చాయి.. ఇప్పుడు రేషన్ కార్డు కావాలని ఒక అప్లికేషన్ కూడా రాలేదు.. భూసమస్యలు, కొత్త పెన్షన్‌లపై కొత్త అప్లికేషన్‌లు వస్తున్నాయి. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. సన్న బియ్యం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తున్నాం.. గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నాం. కొత్త పెన్షన్ పై వినతి పత్రాలు వచ్చాయి.. కొత్తగా 2 లక్షల పెన్షన్లు మంజూరు చేశాం... త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. హైదరాబాద్‌లో ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి.. కొత్తగా లక్ష ఇళ్లు హైదరాబాద్‌లో నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాష్ట్రంలో ఏ ప్రజావాణిలో మీ సమస్య పరిష్కారం కాకున్నా.. ఏ కలెక్టర్ దగ్గర మీ సమస్య పరిష్కారం కాకున్నా గాంధీ భవన్‌కు రండి మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఎరువులు వచ్చిన రాకపోయినా బీజేపీ నాయకత్వం బాధ్యత వహించాలి..
ఇక ఈ నెల 29 నుండి ఏరువాక పౌర్ణమి నుండి వ్యవసాయ కార్యక్రమాలు జరుగుతాయి. విత్తనాల సరఫరా ,ఎరువుల పంపిణీ జరుగుతుంది. భారతదేశంలో రాష్ట్రాలకు ,కేంద్రాలకు వేర్వేరు జాబితాలు ఉండగా కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నాయి. ఎరువులకు సంబంధించి తయారీ, ఉత్పత్తి, సరఫరా కేంద్రం బాధ్యత. రాష్ట్రానికి సరిపడ మొత్తం యూరియా కేంద్రం పంపిణీ చేయాలి. ముడిసరుకు, యూరియా తయారంతా కేంద్రం చూసుకుంటుంది. రాష్ట్రానికి ఎరువులు వచ్చిన రాకపోయినా బీజేపీ నాయకత్వం బాధ్యత వహించాలి. తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని అనేక సార్లు సీఎం, మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎరువులు కేటాయించకపోతే బరాబర్ కేంద్రంతో కొట్లాడుతామని పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. ‘పీఎం కుసుమ్’లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి
జూన్ 24, 2026

KTR | రాష్ట్ర రెవెన్యూ తగ్గుతుంది.. మంత్రి పొంగులేటి రెవెన్యూ వేల కోట్లకు పెరుగుతంది : కేటీఆర్
జూన్ 24, 2026

Balka Suman | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు
- ●TGSRTC Commercial Shops For Rent | వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ కల్పిస్తున్న ఈ 'గోల్డెన్ చాన్స్' మీకోసమే!
- ●Mahua Moitra | సువేందు ప్రతీ విషయంలో అండగా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు
- ●PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. 'పీఎం కుసుమ్'లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి
- ●Ayatollah Ali Khamenei funeral | జులై 9న ఖమేనీ అంత్యక్రియలు.. మోదీని ఆహ్వానించిన ఇరాన్..!
- ●Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?

Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు

TGSRTC Commercial Shops For Rent | వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ కల్పిస్తున్న ఈ 'గోల్డెన్ చాన్స్' మీకోసమే!

Mahua Moitra | సువేందు ప్రతీ విషయంలో అండగా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు

PM KUSUM Scam Telangana | కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కాం.. 'పీఎం కుసుమ్'లో రూ.1000 కోట్ల కుంభకోణం: జగదీశ్ రెడ్డి



