త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక‌గా యోగా దినోత్సవం: ప్ర‌ధాని మోదీ

PM Modi | ప్రపంచం మెుత్తాన్ని యోగా ఏకం చేసిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చొరవ చూపిస్తున్నారని తెలిపారు.

G

National | Published On Jun 21, 2026, 8.21 am IST

PM Modi | ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక‌గా యోగా దినోత్సవం: ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రపంచం మెుత్తాన్ని యోగా ఏకం చేసిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చొరవ చూపిస్తున్నారని తెలిపారు. ఈ రోజు భౌగోళిక సరిహద్దులను దాటి ఒక భారీ సామూహిక ఉద్యమంగా ఎదిగిందని చెప్పారు. వివిద దేశాలు, సంస్కృతుల ప్ర‌జ‌ల‌ను ఏకంచేసి ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక‌గా యోగా దినోత్సవం మారింద‌న్నారు. యోగాతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక‌రికొక‌రు క‌లిసిన‌ట్లుంద‌ని వెల్ల‌డించారు. అంత‌ర్జాత‌య యోగా దినోత్స‌వం (International Yoga Day) సందర్భంగా కోల్‌కతాలో (Kolkata) నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ప్ర‌ధాని పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ..

`జూన్ 21కి ప్ర‌త్యేక విశిష్ట‌త ఉంది. ఎందుకంటే ఇది సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన పగలు (Longest Day) కలిగిన రోజు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా ఈ తేదీకి ఇప్పుడు అదనంగా మరొక ప్రపంచ గుర్తింపు లభించింది. ఇవాళ యోగా కార్య‌క్ర‌మాల‌తో దేశం మొత్తం చైత‌న్యంతో నిండిపోయింది. ఇది కేవ‌లం శారీర‌క వ్యాయామం మాత్రమే కాదు.. కేవ‌లం కొన్ని వ‌య‌స్సుల వారికే ప‌రిమితం కాలేదు. ఇది మాన‌వ స్ఫూర్తికి నిద‌ర్శ‌నం. యోగా అంద‌రినీ ఏకం చేస్తుంది. స‌మ‌తుల్య‌త‌తో జీవించేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఏం చేయాలో, చేయ‌కూడ‌దో నేర్పుతుంది. అందుకే యోగాను కొన్ని సంద‌ర్భాల‌కే పరిమితం చేయ‌కుండా.. నిత్యం సాధ‌న చేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

కాగా, ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో 40 ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రదేశాల్లో యోగా డే వేడుకలు నిర్వహించారు. కోల్‌కతాలో వేర్వేరు చోట్ల 10 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు.

 

Advertisement
Advertisement