Sony BRAVIA Theatre | సోనీ నుంచి బ్రావియా థియేటర్ సిరీస్ సౌండ్ సిస్టమ్‌లు.. అద్భుతమైన క్వాలిటీ, ధర తక్కువ..
Sony BRAVIA Theatre | భారత్‌లో సోనీ తన హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ కొత్త బ్రావియా థియేటర్ ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ కొత్త లైనప్‌లో బ్రావియా థియేటర్ ట్రియో, బార్ 7, బార్ 5, సబ్ 9, సబ్ 8, రియర్ 9, రియర్ 8 మోడళ్లు ఉన్నాయి.
Technology | Published On Jun 24, 2026, 4.56 pm IST
Sony BRAVIA Theatre | భారత్‌లో సోనీ తన హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ కొత్త బ్రావియా థియేటర్ ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ కొత్త లైనప్‌లో బ్రావియా థియేటర్ ట్రియో, బార్ 7, బార్ 5, సబ్ 9, సబ్ 8, రియర్ 9, రియర్ 8 మోడళ్లు ఉన్నాయి. మల్టీ-స్పీకర్ కాన్ఫిగరేషన్లు, స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో ఇంట్లోనే సినిమా హాల్ అనుభూతిని అందించేందుకు ఈ సిరీస్‌ను రూపొందించారు. సోనీకి చెందిన ఆధునిక ఆడియో టెక్నాలజీల సమ్మేళనంతో ఈ ఉత్పత్తులు విస్తృతమైన సౌండ్‌స్టేజ్‌ను అందిస్తూ, కంటెంట్ క్రియేటర్లు ఉద్దేశించిన అసలైన ఆడియో అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తాయని కంపెనీ తెలిపింది. బ్రావియా థియేటర్ ట్రియో ఈ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ వైర్‌లెస్ హోమ్ థియేటర్ సిస్టమ్‌గా నిలుస్తోంది. భారీ స్క్రీన్ టెలివిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సిస్టమ్‌లో సాధారణ సౌండ్‌బార్‌కు బదులుగా ప్రత్యేక లెఫ్ట్, సెంటర్, రైట్ స్పీకర్లు ఉంటాయి. దీంతో మరింత విస్తృతమైన సౌండ్‌స్టేజ్‌తో పాటు డైలాగ్‌లు సైతం స్పష్టంగా వినిపిస్తాయి.
డాల్బీ అట్మోస్, డీటీఎస్ సపోర్ట్..
ఈ సిస్టమ్ డాల్బీ అట్మాస్, డీటీఎస్ సపోర్ట్‌తో వస్తుంది. అనుకూలమైన బ్రావియా టీవీలతో అనుసంధానం చేసినప్పుడు సినిమాలు, సంగీతం, గేమింగ్‌లో డెప్త్, వాస్తవిక ఆడియో అనుభూతిని అందిస్తుంది. సబ్ 9, రియర్ 9తో కలిపి ఉపయోగిస్తే గరిష్టంగా 24 ఫాంటమ్ స్పీకర్ల ప్రభావాన్ని సృష్టిస్తుంది. బ్రావియా థియేటర్ బార్ 7లో 360 స్పేషియల్ సౌండ్ మ్యాపింగ్ టెక్నాలజీని అందించారు. ఇది వర్చువల్ ఫాంటమ్ స్పీకర్ల సహాయంతో సౌండ్‌స్టేజ్‌ను మరింత విస్తరిస్తుంది. సోనీ సౌండ్ ఫీల్డ్ ఆప్టిమైజేషన్, డాల్బీ అట్మాస్, ఐమ్యాక్స్ ఎన్‌హాన్స్డ్ సపోర్ట్‌లతో ఈ సిస్టమ్ వస్తుంది. మొత్తం 9 స్పీకర్ యూనిట్లు, అప్-ఫైరింగ్, సైడ్-ఫైరింగ్ డ్రైవర్లు, నాలుగు పాసివ్ రేడియేటర్లు కలిగిన ఈ మోడల్ సినిమాలు, క్రీడలు, ఇతర వినోద కంటెంట్‌కు మెరుగైన సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. బ్రావియా థియేటర్ బార్ 5 ఓ 3.1-ఛానల్ సౌండ్‌బార్ సిస్టమ్. దీంతోపాటు వైర్‌లెస్ సబ్‌వూఫర్ కూడా లభిస్తుంది. డాల్బీ అట్మాస్, డీటీఎస్:ఎక్స్ సపోర్ట్‌తోపాటు వెర్టికల్ సరౌండ్ ఇంజిన్, ఎస్-ఫోర్స్ ప్రో ఫ్రంట్ సరౌండ్ టెక్నాలజీలను కలిగి ఉంది. ఇవి వర్చువల్ సరౌండ్ సౌండ్ వాతావరణాన్ని సృష్టిస్తాయి.
ధర వివరాలు..
బ్రావియా థియేటర్ ట్రియో జూలై 1 నుంచి సోనీ సెంటర్, సోనీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానుంది. బ్రావియా థియేటర్ బార్ 7 కు కూడా అదే తేదీ నుంచి విక్రయాలను ప్రారంభించనుండగా, బ్రావియా థియేటర్ బార్ 5 ఆగస్టు 18 నుంచి అందుబాటులో ఉంటుంది. సబ్ 9, సబ్ 8 మోడళ్లు ఆగస్టు 3 నుంచి మార్కెట్‌లోకి రానున్నాయి. రియర్ 8, రియర్ 9 స్పీకర్లు జూలై 1 నుంచే విక్రయాలకు సిద్ధమవుతున్నాయి. ఇక బ్రావియా థియేటర్ ట్రియో ఎంఆర్పీ రూ.2,39,990 కాగా బెస్ట్ బై ధరను రూ.1,69,990గా నిర్ణయించారు. బ్రావియా థియేటర్ బార్ 7 ఎంఆర్పీ రూ.99,990 కాగా బెస్ట్ బై ధర రూ.82,990గా ఉంది. బ్రావియా థియేటర్ బార్ 5 ఎంఆర్పీ రూ.37,990 ఉండగా, బెస్ట్ బై ధర రూ.29,990గా ఉంది. బ్రావియా థియేటర్ సబ్ 9 ఎంఆర్పీ రూ.94,990 కాగా బెస్ట్ బై ధర రూ.79,990గా ఉంది, సబ్ 8 ఎంఆర్పీ రూ.42,990, బెస్ట్ బై ధర రూ.34,990, రియర్ 8 ఎంఆర్పీ రూ.44,990, బెస్ట్ బై ధర రూ.39,990, రియర్ 9 ఎంఆర్పీ రూ.74,990, బెస్ట్ బై ధర రూ.58,990గా ఉన్నాయి.
తాజావార్తలు
- ●Chiranjeevi | రామ్ చరణ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన చిరంజీవి
- ●KTR | రాష్ట్ర రెవెన్యూ తగ్గుతుంది.. మంత్రి పొంగులేటి రెవెన్యూ వేల కోట్లకు పెరుగుతంది : కేటీఆర్
- ●Priyanka Mohan | ‘అరసన్’లో ప్రియాంక మోహన్ కొత్త అవతారం.. గత సినిమాలకు భిన్నంగా..!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 791 పాయింట్లు జంప్, భారీగా కొనుగోళ్లు..
- ●Balka Suman | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్
- ●HyPrevent | దాగి ఉన్న హైబీపీని గుర్తించడమే కాదు, ఏఐ ఇక గుండె జబ్బులనూ ముందే చెప్పేస్తుంది.. ఆక్స్ఫర్డ్ పరిశోధకుల సంచలనం..

Chiranjeevi | రామ్ చరణ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన చిరంజీవి

KTR | రాష్ట్ర రెవెన్యూ తగ్గుతుంది.. మంత్రి పొంగులేటి రెవెన్యూ వేల కోట్లకు పెరుగుతంది : కేటీఆర్

Priyanka Mohan | ‘అరసన్’లో ప్రియాంక మోహన్ కొత్త అవతారం.. గత సినిమాలకు భిన్నంగా..!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 791 పాయింట్లు జంప్, భారీగా కొనుగోళ్లు..



