Rajinikanth | నేను మాట్లాడినా తప్పే.. మాట్లాడకపోయినా తప్పే : రజనీకాంత్
Rajinikanth | తనకు బహిరంగంగా మాట్లాడాలంటేనే భయమేస్తోందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అన్నారు. తాను మాట్లాడినా, మాట్లాడకపోయినా తప్పే అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Rajinikanth | సహనటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సాధించిన రాజకీయ విజయం, ఎదుగుదలను చూసి తాను అసూయపడుతున్నట్లు వస్తున్న పుకార్లపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) స్పందించారు. ఈ మేరకు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. తనకు బహిరంగంగా మాట్లాడాలంటేనే భయమేస్తోందన్నారు. తాను మాట్లాడినా, మాట్లాడకపోయినా తప్పే అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
“వేదికపై నన్ను మాట్లాడమని అడిగితే.. నేను మాట్లాడటానికి సంకోచిస్తాను. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా అది నాకూ, ఇతరులకూ సమస్యగా మారుతోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రేపుతోంది. ఒకవేళ నేను మౌనంగా ఉన్నానే అనుకోండి.. ఎందుకు మౌనంగా ఉన్నారు..? అంటూ కొందరు నన్ను విమర్శిస్తారు. అదే మాట్లాడితే ఓహ్ ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు.. అని కొందరు, అసలు మాట్లాడకుండా ఉండాల్సింది కదా అని మరికొందరు అంటారు. ఇవన్నీ విన్నాక చివరికి నాకు ఒకటి అర్థమైంది. మనల్ని ఇష్టపడని వారికి మనం ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా నచ్చదు. ఇప్పుడు మనల్ని ఇష్టపడే కొందరు.. భవిష్యత్తులో కూడా అలాగే ఇష్టపడతారని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి” అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవర్ 173’. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘ధర్మన్’ (Dharman) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
தர்மமே வெல்லும்!#Dharman #Thalaivar173 #SuperstarRajinikanth @rajinikanth #Mahendran @Dir_Ashwath @anirudhofficial @anbariv @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/9ghF9XgboI
— Kamal Haasan (@ikamalhaasan) June 24, 2026
సంబంధిత వార్తలు

Shruti Haasan | అప్పుడు నాన్నకు బాగా కోపం వచ్చింది.. చిన్ననాటి సంఘటనను గుర్తుచేసుకున్న శ్రుతి హాసన్
జూన్ 24, 2026

Udhayanidhi Stalin | భర్త కోసం వెతుకుతున్న భార్య కథ రాష్ట్రమంతా తెలుసు.. సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు
జూన్ 23, 2026

CM Vijay | అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన సీఎం విజయ్.. వీడియో వైరల్
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | యూరియా సరఫరా కేంద్రం బాధ్యతనే.. లేదంటే బరాబర్ కొట్లాడుతాం : మంత్రి పొన్నం
- ●Sony BRAVIA Theatre | సోనీ నుంచి బ్రావియా థియేటర్ సిరీస్ సౌండ్ సిస్టమ్‌లు.. అద్భుతమైన క్వాలిటీ, ధర తక్కువ..
- ●Chiranjeevi | రామ్ చరణ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన చిరంజీవి
- ●KTR | రాష్ట్ర రెవెన్యూ తగ్గుతుంది.. మంత్రి పొంగులేటి రెవెన్యూ వేల కోట్లకు పెరుగుతంది : కేటీఆర్
- ●Priyanka Mohan | ‘అరసన్’లో ప్రియాంక మోహన్ కొత్త అవతారం.. గత సినిమాలకు భిన్నంగా..!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 791 పాయింట్లు జంప్, భారీగా కొనుగోళ్లు..

Ponnam Prabhakar | యూరియా సరఫరా కేంద్రం బాధ్యతనే.. లేదంటే బరాబర్ కొట్లాడుతాం : మంత్రి పొన్నం

Sony BRAVIA Theatre | సోనీ నుంచి బ్రావియా థియేటర్ సిరీస్ సౌండ్ సిస్టమ్‌లు.. అద్భుతమైన క్వాలిటీ, ధర తక్కువ..

Chiranjeevi | రామ్ చరణ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన చిరంజీవి

KTR | రాష్ట్ర రెవెన్యూ తగ్గుతుంది.. మంత్రి పొంగులేటి రెవెన్యూ వేల కోట్లకు పెరుగుతంది : కేటీఆర్



