Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్‌లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?
Entertainment | Published On Jun 24, 2026, 5.30 pm IST
Janhvi Kapoor | రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం తాజాగా విజయోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్‌తో పాటు చిత్రబృందం హాజరై వేడుకను సందడి చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటించిన జాన్వీ కపూర్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న జాన్వీ, రిలీజ్ తర్వాత ముఖం చాటేసింది. మూవీపై గానీ.. అటు తన పాత్రపై గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. సోషల్ మీడియాలోనూ ‘పెద్ది’కు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయకపోవడం గమనార్హం.
అయితే, పెద్ది విజయోత్సవ వేడుకలకు ఆమెను ఆహ్వానించారా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోయినా, హీరోయిన్ హాజరుకాకపోవడం మాత్రం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకవేళ ఆహ్వానం అందినా వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండి ఉండవచ్చనే కూడా పలువురు పేర్కొంటున్నారు. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పాత్రలో నటించింది. అయితే, విడుదల తర్వాత ఈ పాత్ర చిత్రణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ప్రేక్షకులు పాత్ర నిడివి, ప్రాధాన్యం, గ్లామర్ డాల్‌గా చూపించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దర్శకుడు బుచ్చిబాబుపై విమర్శలు గుప్పించగా ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు. సీన్స్‌ను మార్చనున్నట్లు వివరణ ఇచ్చారు.
పెద్ది రిలీజ్‌కు ముందు ఈ ప్రాజెక్ట్‌పై జాన్వీ భారీ అంచనాలు పెట్టుకుంది. జాన్వీ ఈ చిత్రాన్ని బలంగా ప్రమోట్ చేసింది. అయితే, విడుదల అనంతరం పరిస్థితులు మారడంతో ఆమె ఈ చిత్ర బృందానికి దూరంగా ఉంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఈ ప్రాజెక్ట్ కోసం జాన్వీకి సుమారు రూ.8 కోట్ల వరకు పారితోషికం అందినట్లు సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో రూపొందిన ‘పెద్ది’ ఇప్పుడు విజయోత్సవాల వేళ కూడా జాన్వీ గైర్హాజరు అంశంతో మరోసారి వార్తల్లో నిలిచింది. దేవర మూవీతో టాలీవుడ్‌కు జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సైతం జాన్వీకి ఏమాత్రం కలిసి రాలేదు. పెద్దితోనైనా అదృష్టం మారుతుందని భావించగా.. చివరకు నిరాశ ఎదురైంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kamakhya Ambubachi Mela 2026 | యోని ఆకారంలో అమ్మవారు.. కామాఖ్య గుడిలో 'అంబుబాచి మేళా' షురూ.. భక్తులకు కొత్త రూల్స్ ఇవే!
- ●Knack Packaging IPO | న్యాక్ ప్యాకేజింగ్ సంస్థ ఐపీవోకు సిద్ధం.. రూ.440 కోట్ల ఇష్యూ.. ఎప్పుడంటే..
- ●Rajinikanth | నేను మాట్లాడినా తప్పే.. మాట్లాడకపోయినా తప్పే : రజనీకాంత్
- ●Ponnam Prabhakar | యూరియా సరఫరా కేంద్రం బాధ్యతనే.. లేదంటే బరాబర్ కొట్లాడుతాం : మంత్రి పొన్నం
- ●Sony BRAVIA Theatre | సోనీ నుంచి బ్రావియా థియేటర్ సిరీస్ సౌండ్ సిస్టమ్‌లు.. అద్భుతమైన క్వాలిటీ, ధర తక్కువ..
- ●Chiranjeevi | రామ్ చరణ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన చిరంజీవి

Kamakhya Ambubachi Mela 2026 | యోని ఆకారంలో అమ్మవారు.. కామాఖ్య గుడిలో 'అంబుబాచి మేళా' షురూ.. భక్తులకు కొత్త రూల్స్ ఇవే!

Knack Packaging IPO | న్యాక్ ప్యాకేజింగ్ సంస్థ ఐపీవోకు సిద్ధం.. రూ.440 కోట్ల ఇష్యూ.. ఎప్పుడంటే..

Rajinikanth | నేను మాట్లాడినా తప్పే.. మాట్లాడకపోయినా తప్పే : రజనీకాంత్

Ponnam Prabhakar | యూరియా సరఫరా కేంద్రం బాధ్యతనే.. లేదంటే బరాబర్ కొట్లాడుతాం : మంత్రి పొన్నం






