త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran America War | బాలకృష్ణ‌ వీడియోతో ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్‌

Iran America War | అమెరికా , ఇరాన్‌ (Iran America War) మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌పై పైచేయి సాధించేందుకు స్వేత‌సౌధం, హ‌ర్మూజ్‌పై ప‌ట్టు నిలుపుకునేందుకు టెహ్రాన్ త‌మ ఆయుధాల‌కు ప‌నిచెబుతున్నాయి.

G

International | Published On Sep 24, 2026, 6.53 am IST

Iran America War | బాలకృష్ణ‌ వీడియోతో ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్‌
Advertisement

Iran America War | త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికా , ఇరాన్‌ (Iran America War) మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌పై పైచేయి సాధించేందుకు స్వేత‌సౌధం, హ‌ర్మూజ్‌పై ప‌ట్టు నిలుపుకునేందుకు టెహ్రాన్ త‌మ ఆయుధాల‌కు ప‌నిచెబుతున్నాయి. చ‌ర్చ‌లంటూనే ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకుంటున్నాయి. ఓప‌క్క త‌మ ఆయుధ సంప‌త్తి త‌గ్గిపోతున్నా వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని ట్రంప్ రంకెలు వేస్తుండ‌గా, త‌మ‌ను తాము ర‌క్షించుకునే శ‌క్తి ఉంద‌ని.. త‌లొగ్గేది లేదంటూ డ్రోన్లు, క్షిప‌ణుల‌తో అమెరికాకు ఇరాన్ చుక్క‌లు చూపిస్తున్న‌ది. ఇటీవ‌ల న్యూయార్క్‌లోని ఐక్య‌రాజ్య స‌మితి () వేదికగా ఇరు దేశాలు యుద్ధంపై తమ వాద‌న‌ వినిపించాయి. ఈక్ర‌మంలో జింబాబ్వేలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం చేసిన ఓ పోస్టు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భగవంత్‌ కేసరి (Bhagavanth Kesari) సినిమాలో హీరో బాలకృష్ణ విలన్‌లను మట్టికరిపించిన దృశ్యాలను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకోవడం గమనార్హం. రౌడీలంతా ముకుమ్మ‌డిగా తూటాల వ‌ర్షం కురిపిస్తుండగా.. ఓ ఐర‌న్ మూత‌ను అడ్డుపెట్టుకుని హీరో త‌న‌ను తాను ర‌క్షించుకుంటారు. వారి తుపాకుల్లో బుల్లెట్లు అయిపోయేవ‌ర‌కు వేచి చూస్తాడు. చివ‌రికి తుపాకుల‌తో వారికి బ‌దులివ్వ‌కుండా.. గ్యాస్ సిలిండ‌ర్ల‌ను పేల్చి వారికి బుద్ధిచెబుతాడు. ఇరాన్ కూడా అమెరికాతో యుద్ధంతో ఇదే వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

సినిమాలోని క్లైమాక్స్ సీన్‌ను షేర్ చేసిన ఎంబ‌సీ.. ‘ఇరాన్‌ను నాశనం చేయడం గురించి ట్రంప్‌ మాట్లాడుతున్నారు. కానీ.. ఇరాన్ తనను తాను రక్షించుకోలేని దేశం కాదని ఆయనకూ తెలుసు. ఈ విషయం తెలియజేసినప్పటి నుంచి.. వారు హాలీవుడ్‌కు బదులుగా భారతీయ సినిమాలు చూస్తున్నారు’ అని ఎద్దేవా చేసింది. అమెరికాతో యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇరాన్ ఇలాంటి సెటైరిక‌ల్ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టుచేస్తున్న విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement