త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayatollah Ali Khamenei | ట్రంప్ హెచ్చ‌రిక‌లు.. 37 ఏళ్ల సంప్ర‌దాయానికి బ్రేక్ చెప్పిన ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ

Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీంలీడ‌ర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖ‌మేనీ (Ayatollah Ali Khamenei).. 37 ఏళ్ల సంప్ర‌దాయానికి బ్రేక్ చెప్పాడు. ఒమ‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న అణు చ‌ర్చ‌లు విఫ‌ల‌మైతే దాడులు చేసేందుకు కూడా వెనుకాడ‌బోమ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రిక‌ల‌తో ఎయిర్‌ఫోర్స్ క‌మాండ‌ర్ల‌తో జ‌రిగే భేటీకి ఖ‌మేనీ హాజ‌రుకాలేదు.

D

International | Published On Feb 9, 2026, 1.58 pm IST

Ayatollah Ali Khamenei | ట్రంప్ హెచ్చ‌రిక‌లు.. 37 ఏళ్ల సంప్ర‌దాయానికి బ్రేక్ చెప్పిన ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ
Advertisement

Ayatollah Ali Khamenei | అమెరికా-ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తారా స్థాయికి చేరాయి. ఒమ‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న అణు చ‌ర్చ‌లు విఫ‌ల‌మైతే దాడులు చేసేందుకు కూడా వెనుకాడ‌బోమ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ట్రంప్ హెచ్చ‌రిక‌ల‌తో ఇరాన్ సుప్రీంలీడ‌ర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖ‌మేనీ (Ayatollah Ali Khamenei).. 37 ఏళ్ల సంప్ర‌దాయానికి బ్రేక్ చెప్పాడు.

ప్ర‌తి ఏటా ఫిబ్ర‌వ‌రి 8న ఖ‌మేనీ ఎయిర్‌ఫోర్స్ క‌మాండ‌ర్ల‌తో జ‌రిగే భేటీకి హాజ‌ర‌య్యేవారు. అయితే, ట్రంప్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఆ భేటీకి ఖ‌మేనీ గైర్హాజ‌ర‌య్యారు. 1989లో ఇరాన్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఈ భేటీకి ఖ‌మేనీ గైర్హాజ‌రుకావ‌డం ఇదే తొలిసారి. ప్ర‌తి ఏటా ఖ‌మేనీ వార్షిక స‌మావేశానికి హాజ‌ర‌య్యేవారు. ఆఖ‌రికి కొవిడ్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ స‌మ‌యంలోనూ స‌మావేశంలో పాల్గొన్నారు. అయితే, ట్రంప్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్య‌లో తొలిసారి 37 ఏళ్ల సంప్ర‌దాయానికి ఖ‌మేనీ బ్రేక్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ సారి ఖ‌మేనీకి బ‌దులుగా ఆర్మీ వైమానిక దళ కమాండర్లతో సమావేశానికి సాయుధ ద‌ళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ ర‌హీం మౌసావి హాజ‌రైన‌ట్లు ఇరాన్ మీడియా నివేదించింది.

ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు

ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను విరమించుకునేలా ఒప్పందం చేసుకునేందుకు చర్చలకు రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు 'యుఎస్ఎస్ అబ్రహం లింకన్' (USS Abraham Lincoln) ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నేతృత్వంలోని "భారీ నౌకాదళం (Massive Armada)" ఇరాన్ వైపు కదులుతోందని త‌న సొంత సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ప్ర‌క‌టించారు. వెనిజులాకు పంపిన దానికంటే ఇది చాలా పెద్ద నౌకాదళమని, ఇది శక్తి, ఉత్సాహం, లక్ష్యంతో వేగంగా కదులుతోందని పేర్కొన్నారు. ఈ సైన్యం తన మిషన్‌ను వేగంగా.. అవసరమైతే విధ్వంసకరంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించారు.

Advertisement
Advertisement