US F-15 Fighter Jet | అమెరికా ఎఫ్-15ను కూల్చేసిన ఇరాన్.. వట్టిదేనన్న యూఎస్
US F-15 Fighter Jet | ఇరాన్‌తో (Iran) యుద్ధంలో అమెరికాకు (America) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితం ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్‌గా పేరుపొందిన అమెరికా ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ (F-35 Fighter Jet) ఇరాన్ దాడిలో దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా మరో యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను (US F-15 Fighter Jet) కూల్చేసినట్లు ప్రకటించింది.
International | Published On Mar 23, 2026, 7.32 am IST
US F-15 Fighter Jet | త్రినేత్ర.న్యూస్: ఇరాన్‌తో (Iran) యుద్ధంలో అమెరికాకు (America) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితం ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్‌గా పేరుపొందిన అమెరికా ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ (F-35 Fighter Jet) ఇరాన్ దాడిలో దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా మరో యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను (US F-15 Fighter Jet) కూల్చేసినట్లు ప్రకటించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణితో కూల్చిసినట్లు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. హర్మూజ్ జలసంధి సమీపంలో ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను కూల్చటానికి ముందు ఇరాన్ దక్షిణ తీరంలో గుర్తించినట్లు తెలిపారు.
శత్రువుకు చెందిన యుద్ధ విమానం చొరబాటును తమ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. ఫైటర్ జెట్‌ను కూల్చటానికి ముందు ట్రాక్ చేసిన క్లిప్‌ను పోస్టు చేశారు. అయితే జెట్ పరిస్థితి, దానికి జరిగిన నష్టం లేదా ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకుంటే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరిక తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
https://x.com/IRANinMumbai/status/2035649924877222141
కాగా, ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను కూల్చినట్లు వచ్చిన వార్తలను అమెరికా ఖండించింది. అది ఒక వదంతి అని యూఎస్ సెంట్రల్ కమాండ్ కొట్టిపారేసింది అని పేర్కొంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా దళాలు 8 వేలకుపైగా యుద్ధ విమానాలను వినియోగింది. ఇప్పటి వరకు ఒక్క అమెరికా యుద్ధ విమానాన్ని కూడా ఇరాన్ కూల్చివేయలేదని స్పష్టం చేసింది.
ఈ నెల 20న ఇరాన్ క్షిపణి దాడిలో దెబ్బతిన్న అమెరికా ఎఫ్-35 లైట్నింగ్-2 యుద్ధ విమానం ఎమర్జెన్సీ లాండింగ్ (Emergency Landing) అయిన విషయం తెలిసిందే. మధ్యప్రాచ్యంలోని ఒక సైనిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యూఎస్ సైన్యానికి చెందిన అత్యంత అధునాతన, ఖరీదైన విమానాలలో ఒకదానిని ఇరాన్ కూల్చివేయడం అదే మొదటిసారి.
https://x.com/CENTCOM/status/2035748910656852168
సంబంధిత వార్తలు

Iran War | ఇరాన్‌తో యుద్ధంలో 16 యుద్ధ విమానాలను కోల్పోయిన అమెరికా
మార్చి 20, 2026

F-35 Fighter Jet | అమెరికా ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తామే దాడిచేశామన్న ఐఆర్జీసీ
మార్చి 20, 2026

Bunker Buster Bombs | హర్మూజ్ సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడిన యూఎస్
మార్చి 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



