త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran drone carrier on fire | ఇరాన్ డ్రోన్ క్యారియ‌ర్ షిప్‌ను ధ్వంసం చేసిన అమెరికా

Iran drone carrier on fire | ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో భాగంగా ఇరాన్ నేవీ లక్ష్యంగా అమెరికా దాడులను తీవ్రత‌రం చేసింది. ఈ క్ర‌మంలో ఇరాన్‌కు చెందిన ఓ భారీ డ్రోన్ క్యారియ‌ర్ షిప్‌పై దాడి చేసి ధ్వంసం చేసింది.

D

International | Published On Mar 6, 2026, 11.51 am IST

Iran drone carrier on fire | ఇరాన్ డ్రోన్ క్యారియ‌ర్ షిప్‌ను ధ్వంసం చేసిన అమెరికా
Advertisement

Iran drone carrier on fire | బాంబుల మోత‌తో ప‌శ్చిమాసియా దద్ద‌రిల్లుతోంది. ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్ మ‌ధ్య‌ దాడులు, ప్ర‌తిదాడులు కొన‌సాగుతున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో భాగంగా ఇరాన్ నేవీ లక్ష్యంగా అమెరికా దాడులను తీవ్రత‌రం చేసింది. ఈ క్ర‌మంలో ఇరాన్‌కు చెందిన ఓ భారీ డ్రోన్ క్యారియ‌ర్ షిప్‌పై దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ దాడితో ఆ భారీ నౌక మంట‌ల్లో చిక్కుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదిక‌గా షేర్ చేసింది.

ఇరాన్ నావికాద‌ళాన్ని (Iran navy) మొత్తం నాశ‌నం చేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకెళ్తున్న‌ట్లు తెలిపింది. అమెరికా దళాలు ఎక్కడా వెనకడుగు వేయడం లేదని వెల్ల‌డించింది. ఇందులో భాగంగానే ఇరానియ‌న్ డ్రోన్ క్యారియ‌ర్‌పై దాడి చేసిన‌ట్లు పేర్కొంది. త‌మ దాడిలో ఆ భారీ నౌక మంట‌ల్లో చిక్కుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇక ఈ యుద్ధం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఇరాన్‌కు చెందిన 30 యుద్ధ నౌక‌ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు సెంట్ర‌ల్ క‌మాండ్ వెల్ల‌డించింది. అంతేకాదు, టెహ్రాన్‌లోని 200కిపైగా ల‌క్ష్యాల‌పై బాంబ‌ర్ ఫోర్స్ దాడి చేసిన‌ట్లు వెల్ల‌డించింది. మ‌రోవైపు ఈ యుద్ధం వ‌రుస‌గా ఏడో రోజుకు చేరింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా ద‌ళాలు విరుచుకు ప‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో ఇరాన్ సైతం ప్ర‌తిదాడుల‌తు చేస్తోంది.

https://x.com/CENTCOM/status/2029725370371424476

Also Read..

Britney Spears | మ‌ద్యం సేవించి డ్రైవింగ్‌.. పాప్ స్టార్ బ్రిట్నీ స్పియ‌ర్స్ అరెస్ట్

Donald Trump | ముందు ఇరాన్ ప‌ని ముగిస్తాం.. ఆ త‌ర్వాత క్యూబా ప‌నిప‌డ‌తాం : ట్రంప్‌

Gold And Silver Rates Today | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఫ్యూచర్ల‌లో తీవ్ర‌మైన అస్థిర‌త‌..

Advertisement
Advertisement