Indian Passport | 10 స్థానాలు మెరుగు పరుచుకున్న భారత పోస్‌పోర్టు.. ఇప్పుడు ర్యాంకు ఎంతంటే..?
Indian Passport | ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్టుల స్థితిగతులపై సమాచారం అందించే హెన్లీ సంస్థ తాజాగా తన కొత్త ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఈ ఏడాది భారత పాస్‌పోర్టు బలపడింది. తాజా Henley Passport Index లో భారత పాస్‌పోర్టు 75వ స్థానానికి చేరుకుంది.
International | Published On Feb 14, 2026, 7.44 am IST
Indian Passport | ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్టుల స్థితిగతులపై సమాచారం అందించే హెన్లీ సంస్థ తాజాగా తన కొత్త ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఈ ఏడాది భారత పాస్‌పోర్టు బలపడింది. తాజా Henley Passport Index లో భారత పాస్‌పోర్టు 75వ స్థానానికి చేరుకుంది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఏకంగా 10 స్థానాలు ఎగబాకడం విశేషం. దీంతో భారత పాస్‌పోర్టు హోల్డర్లు ఇప్పుడు వీసా లేకుండా 56 దేశాలకు ప్రయాణించే అవకాశం పొందారు. Henley Passport Index ఏ దేశ పాస్‌పోర్టు కలిగిన వారు అయినా సరే వీసా అవసరం లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా ఎన్ని దేశాలకు వెళ్లగలరో దాని ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తుంది. పాస్‌పోర్టు ర్యాంకు మెరుగ్గా ఉండడం అంటే ఆ దేశ పౌరులకు అంతర్జాతీయ ప్రయాణాలు సులభంగా ఉండటాన్ని సూచిస్తుంది. ఇటీవలి కాలంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత పాస్‌పోర్టు ఇప్పుడు మళ్లీ మెరుగుదల దిశగా పయనిస్తున్నట్లు ఈ ర్యాంకింగ్స్ సూచిస్తున్నాయి.
2006లో అత్యుత్తమ స్థానం
తాజా ర్యాంకుల్లో భారత పాస్‌పోర్టు గణనీయంగా మెరుగుపడినప్పటికీ, ఇది ఇప్పటికీ తన అత్యుత్తమ స్థాయికి దూరంగానే ఉంది. హెన్లీ జాబితాలో భారత్ అత్యధికంగా 71వ స్థానాన్ని 2006లో సాధించింది. ఆ తర్వాతి కాలంలో భారత పాస్‌పోర్టు ర్యాంకు ఎక్కువగా 80ల చుట్టూ తిరుగుతూ వచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత పాస్‌పోర్టు ర్యాంకు మెరుగుపడటం దేశం అంతర్జాతీయ వేదికపై బాధ్యతాయుతమైన, ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నదనే సంకేతంగా చూడవచ్చు. ప్రపంచ దేశాలు భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా గుర్తించడం వల్లే భారత పౌరులకు ఈ విధమైన ప్రయాణ సౌలభ్యాలు లభిస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు.
భారత పాస్‌పోర్టుకు వీసా ఫ్రీ దేశాలు
భారత పాస్‌పోర్టు కలిగిన వారు వీసా లేకుండా ప్రవేశించగల దేశాల్లో అంగోలా, బార్బడోస్, భూటాన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్, డొమినికా, ఫిజీ, గ్రెనడా, హైటి, జమైకా, కజకిస్తాన్, కెన్యా, కిరిబాటి, మకావ్, మలేషియా, మారిషస్, మైక్రోనేషియా, మాంట్సెరాట్, నేపాల్, ఫిలిప్పీన్స్, రువాండా, సెనెగల్, సెషెల్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ విన్సెంట్, థాయిలాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వనౌటు వంటి దేశాలు ఉన్నాయి. అలాగే వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించే దేశాల్లో అల్బేనియా, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కోమోరో దీవులు, జిబౌటి, ఎథియోపియా, గినియా-బిస్సౌ, ఇండోనేషియా, జోర్డాన్, లావోస్, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మంగోలియా, మొజాంబిక్, మయన్మార్, నియూ, పలావ్ దీవులు, ఖతార్, సమోవా, సియెర్రా లియోన్, శ్రీలంక, సెయింట్ లూసియా, టాంజానియా, టిమోర్-లెస్టే, టువాలు, జింబాబ్వే ఉన్నాయి.
జాబితాలో సింగపూర్ అగ్రస్థానం
తాజా హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. జపాన్, దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులు 187 దేశాలకు వీసా ఫ్రీ ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మూడో స్థానంలో ఉండగా, ఈ రెండు దేశాల పాస్‌పోర్టులతో 186 దేశాలకు వీసా అవసరం లేదు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టు హోల్డర్లు 185 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఆస్ట్రియా, గ్రీస్, మాల్టా, పోర్చుగల్ తదుపరి స్థానాల్లో ఉండగా, వీటి పాస్‌పోర్టులకు 184 దేశాలకు వీసా ఫ్రీ సౌకర్యం ఉంది. ఆస్ట్రేలియా, యూకే, కెనడా, న్యూజిలాండ్ కూడా టాప్ 10 జాబితాలో ఉన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
జులై 5, 2026

Telegram | టెలిగ్రామ్‌లో మళ్లీ మెసేజ్ ఎడిట్ ఫీచర్.. పాత తరహాలోనే పనిచేస్తుంది..
జులై 1, 2026

Apple Products | భారత గ్రే మార్కెట్లలోకి యాపిల్ ఉత్పత్తులు.. ధరల పెంపు ఎఫెక్ట్..?
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



