Taxi Driver | కిరాయి అడిగితే ట్యాక్సీ డ్రైవర్ చెంప పగలగొట్టింది.. సింగపూర్‌లో భారత సంతతి మహిళకు రెండు వారాల జైలు
Taxi Driver | మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ ట్యాక్సీలో ఎక్కింది. డ్రైవర్‌కు (Taxi Driver) తన ఇంటివద్ద దించాలని చెప్పి నిద్రలోకి జారుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత డబ్బు ఇవ్వమంటే తన వద్ద లేదంటూ మొండికేసింది. అతనితో గొడవపడి ఆమె పోలీసుల ఎదుటే 73 ఏండ్ల వృద్ధుడైన ఆ డ్రైవర్ చెంపపై (Slapping) కొట్టింది.
International | Published On Feb 20, 2026, 7.20 am IST
Taxi Driver | త్రినేత్ర.న్యూస్: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ ట్యాక్సీలో ఎక్కింది. డ్రైవర్‌కు (Taxi Driver) తన ఇంటివద్ద దించాలని చెప్పి నిద్రలోకి జారుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత డబ్బు ఇవ్వమంటే తన వద్ద లేదంటూ మొండికేసింది. అతనితో గొడవపడి ఆమె పోలీసుల ఎదుటే 73 ఏండ్ల వృద్ధుడైన ఆ డ్రైవర్ చెంపపై (Slapping) కొట్టింది. దీంతో కోర్టు ఆ మహిళకు రెండు వారాల జైలు శిక్ష విధించింది.
శాలినీ దేవరాజన్ (36) అనే భారత సంతతికి చెందిన మహిళ (Indian-Origin Woman) సింగపూర్‌లో (Singapore) ఉంటున్నది. గతేడాది నవంబర్ 11న ఓ ట్యాక్సీ ఎక్కింది. మద్యం మత్తులో ఉన్న ఆమె కారు ఎక్కగానే పడుకున్నది. గమ్యస్థానం వచ్చిన తర్వాత ట్యాక్సీ డ్రైవర్ (73) ఆమెను నిద్రలేపాడు. ట్యాక్సీ కిరాయి 24 సింగపూర్ డాలర్లు (SGD) చెల్లించాలని చెప్పాడు. దీంతో తన వద్ద క్యాష్ లేదని, ఆన్‌లైన్‌లో కూడా చెల్లించడానికి డబ్బు లేదని చెప్పింది. ఇంట్లోకి వెళ్లి డబ్బు తీసుకొస్తానని అతనికి చెప్పడంతో ఫోన్ అక్కడే పెట్టి వెళ్లాలని కోరాడు. దానికి నిరాకరించింది. అయితే తానూ వస్తానని చెబితే ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్ని. డబ్బు ఇచ్చేది లేదని, తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లొచ్చని దేవరాజన్ చెప్పడంతో.. ఆ డ్రైవర్ కూడా అదేపని చేశాడు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన దేవరాజన్.. పోలీసుల ఎదుటే అతని ఎడమ చెంపపై కొట్టింది. అసలే వృద్ధుడు కావడంతో పోలీసులు అతడిని దవాఖానకు తరలించారు. ఒకరోజు చికిత్స అనంతరం ఆ డ్రైవర్‌ను హాస్పిటల్ నుంచి డిస్చార్జి చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు శాలినిని అరెస్టు చేశారు. దీంతో కోర్టు ఆమెకు రెండు వారాల జైలు శిక్షతోపాటు వైద్య ఖర్చుల నిమిత్తం బాధితుడికి 172 సింగపూర్ డాలర్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. కాగా, డ్రైవర్‌తో గొడవపడిన సమయంలో దేవరాజన్ వద్ద 50 సింగపూర్ డాలర్లు ఉండటం గమనార్హం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






