త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bathukamma Celebrations | సింగపూర్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు.. టీసీఎస్​ఎస్​ బృందానికి హ‌రీశ్ రావు అభినంద‌న‌

Bathukamma Celebrations | సింగ‌పూర్‌లోని అవ‌ర్ టాంపిన్స్‌లో బ‌తుక‌మ్మ సంబురాలు (Bathukamma Celebrations) ఘ‌నంగా నిర్వ‌హించారు. అక్టోబర్ 17న తెలంగాణ కల్చరల్ సొసైటీ - సింగపూర్ (TCSS)​ ఆధ్వర్యంలో జ‌రిగిన వేడుక‌ల్లో పెద్ద సంఖ్య‌లో ఆడ‌ప‌డుచులు పాల్గొన్ని బతుక‌మ్మ ఆట‌పాట‌ల‌తో కోలాహ‌లం చేశారు.

G

Telangana | Published On Oct 19, 2026, 12.52 pm IST

Bathukamma Celebrations | సింగపూర్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు.. టీసీఎస్​ఎస్​ బృందానికి హ‌రీశ్ రావు అభినంద‌న‌
Advertisement

Bathukamma Celebrations | త్రినేత్ర న్యూస్: స సింగ‌పూర్‌లోని అవ‌ర్ టాంపిన్స్‌లో బ‌తుక‌మ్మ సంబురాలు (Bathukamma Celebrations) ఘ‌నంగా నిర్వ‌హించారు. అక్టోబర్ 17న తెలంగాణ కల్చరల్ సొసైటీ - సింగపూర్ (TCSS)​ ఆధ్వర్యంలో జ‌రిగిన వేడుక‌ల్లో పెద్ద సంఖ్య‌లో ఆడ‌ప‌డుచులు పాల్గొన్ని బతుక‌మ్మ ఆట‌పాట‌ల‌తో కోలాహ‌లం చేశారు. ప్రతి ఏడాదీ టీసీఎస్​ఎస్​ బతుకమ్మ వేడుకలను సెంబవాంగ్ పార్క్‌లో నిర్వహించేవారు. అయితే ఈసారి వేదికను అవర్ టాంపిన్స్​ హబ్​కు మార్చారు. అక్కడ ఏర్పాటుచేసిన భారీ ఎల్​ఈడీ స్క్రీన్, రిబ్బన్ ఎల్​ఈడీలు బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వేడుక‌ల్లో సుమారు 2500 మంది పాల్గొన్నారు. వివిధ రూపాల్లో అందంగా అలంకరించిన 150కి పైగా బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మని పేర్చి తెచ్చిన, ప్రతి ఒక్కరినీ రెడ్ కార్పెట్​పై స్వాగతించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 10 బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబైన ఐదుగురు మహిళలకు, ప్రతిరోజు బతుకమ్మ పేర్చిన చిన్నారులకు టీసీఎస్​ఎస్​ సొసైటీ (నగదు వోచర్లు), భీమా జ్యువెలర్స్ (బంగారు వస్తువులు), సౌజన్య డెకార్స్ (వెండి వస్తువులు), బీఎస్​కే కలెక్షన్స్ (సారీస్), ఎస్​ఎస్ క్రియేషన్స్ (సారీస్) ప్రత్యేక బహుమతులు అందించారు.

ఈ వేడుకలలో పాల్గొన్న రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ ఎస్.పీ.ఎస్. ఒబెరాయ్​, భారత హైకమిషన్​ ప్రథమ కార్యదర్శి (వాణిజ్యం) మృత్యుంజయ్ శ్రీకాంతన్​ను టీసీఎస్​ఎస్​ సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, కమిటీ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రోన్జ్, బ్రాస్ కేటగిరీ కార్పొరేట్ వ్యక్తిగత దాతలను శాలువాలతో సన్మానించారు.

సింగపూర్​లో నివసిస్తున్న తెలుగు వారందరూ దశాబ్దానికి పైగా బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం టీసీఎస్​ఎస్​ చరిత్రలో నిలిచిపోనుందని సొసైటీ సభ్యులు అన్నారు. ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా విడుదల చేసిన టీసీఎస్​ఎస్​ బతుకమ్మ పాట `జాజిరి జాజిరి ఉయ్యాలా మా పూల పండుగ జంపాల` యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందిందని తెలిపారు. వేడుక‌లు విజయవంతంగా జరగడానికి సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ప్రత్యేకంగా తయారు చేయించిన ఫోటోబూత్, కృత్రిమ బతుకమ్మలు ఆకర్షణగా నిలిచాయన్నారు.

ఈ పండుగను నిర్వహించడానికి సింగపూర్​లోని బూన్ లే, జూరాంగ్ ఈస్ట్, బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్, పుంగ్గోల్, జలాన్ పపన్, పెంజురు ప్రాంతాల నుంచి బస్సులను నామమాత్రపు రుసుముతో సమకూర్చినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. బతుకమ్మ పండుగలో పాల్గొన్న అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోశ్‌ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు తదితరులు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ కల్చరల్ సొసైటీ (Telangana Cultural Society)-సింగపూర్ బృందాన్ని బీఆర్ఎస్ ఎల్పి ఉప‌నేత హ‌రీశ్​రావు (Harish Rao) వీడియో సందేశం ద్వారా అభినందించారు. సింగపూర్‌లో బతుకమ్మను నిర్వహిస్తూ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement