Indian Navy | భారత్ కార్గో షిప్‌ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?
గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో సముద్రపు దొంగల కిడ్నాప్ యత్నాన్ని ఇండియన్ నేవీ తిప్పికొట్టింది. ఇండియాకు వస్తున్న కార్గో షిప్‌ను మార్కోస్ కమాండోలు ఎలా రక్షించారంటే?
International | Published On Jul 2, 2026, 5.36 pm IST
- గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో 'ఎంవీ గోల్డెన్ ఆర్సెనల్' షిప్‌పై సముద్రపు దొంగల దాడి
- వెంటనే 'సేఫ్ రూమ్'లోకి వెళ్లి లాక్ చేసుకున్న నౌక సిబ్బంది
- డిస్ట్రెస్ కాల్‌తో అప్రమత్తమైన ఐఎన్ఎస్ త్రికండ్ వార్‌షిప్.. దొంగల ఎస్కేప్
- రంగంలోకి దిగిన మార్కోస్ కమాండోలు.. భారత్‌కు వస్తున్న కార్గో షిప్ సేఫ్
Indian Navy | త్రినేత్ర.న్యూస్ : గల్ఫ్ ఆఫ్ ఎడెన్ (Gulf of Aden) సముద్ర మార్గంలో బుధవారం రాత్రి భారీ హైజాక్ కుట్ర భగ్నమైంది. భారత్‌కు అత్యవసరమైన సరుకులతో వస్తున్న ఓ మర్చంట్ వెసెల్ (కార్గో షిప్)ను సముద్రపు దొంగలు (పైరేట్స్) హైజాక్ చేసేందుకు ప్రయత్నించగా.. ఇండియన్ నేవీ వార్‌షిప్ 'ఐఎన్ఎస్ త్రికండ్' వేగంగా స్పందించి వారి ప్లాన్‌ను తిప్పికొట్టింది.
షిప్‌లో అసలేం జరిగింది?
'ఎంవీ గోల్డెన్ ఆర్సెనల్' (MV Golden Arsenal) అనే ఈ కార్గో షిప్‌లో ఒక భారతీయుడు సహా పలువురు క్రూ మెంబర్స్ ఉన్నారు. బుధవారం రాత్రి అనుమానాస్పదంగా కొందరు పైరేట్స్ షిప్‌ను బోర్డ్ చేసేందుకు (ఎక్కేందుకు) ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. యాంటీ-పైరసీ ప్రోటోకాల్‌ను ఫాలో అయ్యారు. లోపల ఉన్న ఓ 'సేఫ్ రూమ్'లో లాక్ చేసుకుని, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా అధికారులకు అలర్ట్ పంపారు.
భయపడి పారిపోయిన పైరేట్స్
ఆ ప్రాంతంలోనే ఆపరేషన్స్‌లో ఉన్న ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ త్రికండ్ (INS Trikand) ఈ డిస్ట్రెస్ కాల్ (ఎమర్జెన్సీ మెసేజ్) అందుకుంది. క్షణాల్లో ఆ మర్చంట్ వెసెల్ వైపు దూసుకెళ్లింది. నేవీ వార్‌షిప్ తమవైపు వస్తుండటాన్ని గమనించిన సముద్రపు దొంగలు.. షిప్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకోకముందే భయపడి అక్కడినుంచి పారిపోయారు.
రంగంలోకి మార్కోస్ కమాండోలు
ఆ వెంటనే భారత నావికాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు (MARCOS) గోల్డెన్ ఆర్సెనల్ షిప్‌లోకి ఎంటర్ అయ్యారు. నౌకలో అణువణువూ గాలించి (శానిటైజేషన్ ఆపరేషన్), ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారు. ప్రస్తుతం షిప్‌తో పాటు అందులోని సిబ్బంది అంతా సేఫ్‌గా ఉన్నారని, నౌకకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ నౌకలో భారత్‌కు అవసరమైన అత్యంత కీలకమైన కార్గో ఉన్నట్లు తెలుస్తోంది.
అలర్ట్‌గా ఇండియన్ నేవీ
హార్న్ ఆఫ్ ఆఫ్రికాకు దగ్గరగా ఉండే 'గల్ఫ్ ఆఫ్ ఎడెన్' ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి. ఇక్కడ పైరేట్స్ దాడులు కామన్. అందుకే, మర్చంట్ షిప్‌లకు రక్షణ కల్పించేందుకు ఇండియన్ నేవీ ఈ ప్రాంతంలో ఎప్పుడూ తన ఫ్రంట్‌లైన్ వార్‌షిప్‌లను మోహరించి ఉంచుతుంది. గత రెండేళ్లుగా అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మీదుగా ప్రయాణించే భారతీయ నావికులను, వాణిజ్య నౌకలను రక్షించడంలో మన నేవీ వరుస యాంటీ-పైరసీ ఆపరేషన్లతో సత్తా చాటుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DRDO | బాలిస్టిక్ మిస్సైల్ దాడులకు భారత్ చెక్.. సరికొత్త వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో
జూన్ 13, 2026

Navy | ఇండియన్ నేవీ కొత్త చీఫ్‌గా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
మే 31, 2026

Rajnath Singh | జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ తారాగిరి.. హాజరైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్..
ఏప్రిల్ 3, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



