Rajnath Singh | జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ తారాగిరి.. హాజరైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్..
Rajnath Singh | భారత్ సముద్ర భద్రతను మరింత బలోపేతమవుతున్నది. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన స్టెల్త్ ఫ్రిగేటర్స్ ఐఎన్ఎస్ ‘తారాగిరి’, ‘ఐఎన్‌ఎస్ అరిదమన్’లను విశాఖపట్నంలోని నౌకాదళ డాక్‌యార్డులో శుక్రవారం జలప్రవేశం చేయించారు.
Rajnath Singh | భారత్ సముద్ర భద్రతను మరింత బలోపేతమవుతున్నది. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన స్టెల్త్ ఫ్రిగేటర్స్ ఐఎన్ఎస్ ‘తారాగిరి’, ‘ఐఎన్‌ఎస్ అరిదమన్’లను విశాఖపట్నంలోని నౌకాదళ డాక్‌యార్డులో శుక్రవారం జలప్రవేశం చేయించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఐఎన్‌ఎస్ తారాగి జల ప్రవేశంతో భారత నౌకాదళ శక్తి మరింత పెరిగిందన్నారు.
భారత సామర్థ్యానికి నిదర్శనం..
ఈ యుద్ధ నౌక బ్రహ్మోస్, సూపర్‌సోనిక్ క్షిపణులతో కూడి ఉంటుందని, చరిత్ర చెబుతున్నదేమిటంటే నౌకాదళ శక్తి బలంగా లేని దేశాన్ని శక్తివంతమైన దేశంగా పరిగణించలేమని రక్షణమంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం నగరం భారత సముద్ర సామర్థ్యానికి నిదర్శనమని, ఇక్కడి నుంచే తారాగిరి జలప్రవేశం చేయడం ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయమన్నారు. మన సంస్కృతి నుంచి నేటి వ్యూహాత్మక అవసరాల వరకు సముద్రం భారత అభివృద్ధికి కీలక పాత్ర పోషించిందని, కాలక్రమేణా సముద్రంతో మన అనుబంధం మరింత బలపడిందన్నారు. దేశ భద్రత కేవలం తీర ప్రాంతాలకే పరిమితం కాకూడదని, ముఖ్య సముద్ర మార్గాలు, చోక్ పాయింట్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను కూడా సమగ్రంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను భారత నౌకాదళం సమర్థంగా నిర్వహిస్తోందని అన్నారు.
అవసరం కాదు.. అనివార్యం..
తీవ్రత పెరిగిన సందర్భాల్లో భారత నౌకాదళం వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్ల భద్రతను కాపాడిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మన నౌకాదళం భారత ప్రయోజనాల పరిరక్షణతో పాటు, అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా భారతీయుల రక్షణ కోసం చర్యలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉందని, ఇది భారతాన్ని బాధ్యతాయుత సముద్ర శక్తిగా నిలబెడుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలన్న లక్ష్యంలో నౌకాదళ పాత్ర అత్యంత కీలకమన్నారు. 11వేల కిలోమీటర్లకుపైగా తీరప్రాంతం, మూడు వైపులా సముద్రంతో ఉన్న మన దేశ అభివృద్ధి సముద్రంపై ఆధారపడి ఉంది. దేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం సముద్ర మార్గాల ద్వారానే సాగుతోంది. శక్తివంతమైన నౌకాదళం మనకు అవసరం మాత్రమే కాదు.. అనివార్యమని ఆయన స్పష్టం చేశారు.
సరిహద్దు రక్షణలో కీలకం..
స్టెల్త్ సాంకేతికత తారాగిరిని రూపొందించారు. సముద్ర సరిహద్దు రక్షణలో ముఖ్య భూమిక పోషించనుంది. నీలగిరి శ్రేణి 17-ఏలో నాలుగో ప్రాజెక్టులో భాగంగా ఈ యుద్ధనౌక ను ముంబయిలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో నిర్మించారు. శత్రువుల రాడార్‌లకు చిక్కకుండా పని చేసే సామర్థ్యం ఈ నౌక స్పెషాలిటీ. గతేడాదిలోనే సిద్ధం కాగా.. నవంబర్ 28న నేవీకి అప్పగించారు. తాజాగా నౌకను కమిషన్ చేశారు. ఈ నౌక 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు ఉంటుంది. 6,670 టన్నుల బరువుండే ఐఎన్‌ఎస్ తారాగిరి కంబైన్డ్ డీజిల్, గ్యాస్ ఆధారిత ప్లాంటుతో సముద్ర జలాల్లో గంటకు 28 నాట్స్ వేగంతో దూసుకెళ్తుంది. స్టెల్త్ ఫ్రిగేట్‌తో కూడిన అత్యాధునిక టెక్నాలజీని ఇందులో వినియోగించారు. బరాక్-8 వంటి విమాన విధ్వంసక, 8 బ్రహ్మోస్ వంటి విధ్వంసక క్షిపణులు ఇందులో ఉన్నాయి. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ వ్యవస్థతోపాటు, శత్రువుల జాడను, ముప్పును ముందే పసిగట్టే పవర్‌ఫుల్ రాడార్ వ్యవస్ధ ఈ నౌకలో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
జులై 27, 2026

DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..
జులై 27, 2026

TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత పనితీరుపై కేసీ వేణుగోపాల్ సమీక్ష
జులై 27, 2026
తాజావార్తలు
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి
- ●DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?



