త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | వెనెజువెలా నుంచి భార‌త్ ఇంధ‌నం దిగుమ‌తి చేసుకుంటుంది : ట్రంప్

భార‌త్ చ‌మురు కొనుగోళ్ల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

D

International | Published On Feb 1, 2026, 11.19 am IST

Donald Trump | వెనెజువెలా నుంచి భార‌త్ ఇంధ‌నం దిగుమ‌తి చేసుకుంటుంది : ట్రంప్
Advertisement

Donald Trump | భార‌త్ చ‌మురు కొనుగోళ్ల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వెనెజువెలా నుంచి భార‌త్ (India) ఇంధ‌నం కొనుగోలు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇరాన్ చ‌మురుకు బ‌దులు వెనెజువెలా ఇంధ‌నాన్ని (Venezuelan Oil) ఇండియా కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఎయిర్‌ఫోర్స్‌వ‌న్‌లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. వెనెజువెలాతో ఇటీవ‌లే ఓ డీల్ కుదుర్చుకున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఇందులో భార‌త్ కూడా చేర‌నుంద‌ని చెప్పారు. ఇరాన్ చ‌మురుకు బ‌దులు వెనెజువెలా ఇంధ‌నాన్ని ఇండియా దిగుమ‌తి చేసుకుంటుంద‌న్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఇప్ప‌టికే ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లు ట్రంప్ చెప్పారు. అంతేకాదు చ‌మురు ఒప్పందం విష‌యంలో చైనాను కూడా స్వాగ‌తించారు. ఆ దేశంతో డీల్ గొప్ప‌గా ఉంటుందని ట్రంప్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement