US lawmaker Ro Khanna | పుతిన్ కూడా జెలెన్‌స్కీని బందీ చేస్తే? ట్రంప్‌పై భారత సంతతి ఎంపీ ధ్వజం
విదేశీ యుద్దాల్లో అనవసరంగా తలదూర్చబోనని చెప్పిన ట్రంప్.. ఇప్పుడు వెనిజులాలో సొంత నిర్ణయంతో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా లాంటి దేశాల్లో అనవసర యుద్ధాలు చేసి నష్టపోయాం
International | Published On Jan 4, 2026, 5.45 pm IST
US lawmaker Ro Khanna | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. వెనిజులాపై చేసిన మెరుపు దాడిపై పలు దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకొని అమెరికాను తరలించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికాలోనే రాజకీయ దుమారం లేచింది. ఈ ఆపరేషన్‌పై భారత సంతతికి చెందిన డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా స్పందించారు. ఈ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. తన నైతిక అధికారాన్ని అమెరికా కోల్పోతోందని.. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ధోరణులకు దారి తీస్తుందని హెచ్చరించారు.

ఎక్స్ వేదికగా స్పందించిన రో ఖన్నా.. ఒకవేళ పుతిన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని బంధీగా చేసుకోవాలని చూస్తే, తైవాన్ నాయకత్వంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇలాంటి చర్యలకు దిగితే మనం ఏం సమాధానం చెబుతాం? అంటూ ప్రశ్నించారు. ఒక దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని మార్చడానికి, విదేశీ నేతలను బందీలుగా చేసుకోవడానికి యుద్ధం చేయడం అనేది అంతర్జాతీయంగా పెను ముప్పుగా మారుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
MAGA మద్దతుదారులను వంచించిన ట్రంప్
ట్రంప్ MAGA (Make America Great Again) మద్దతుదారులను వంచించారని రో ఖన్నా ఆరోపించారు. విదేశీ యుద్దాల్లో అనవసరంగా తలదూర్చబోనని చెప్పిన ట్రంప్.. ఇప్పుడు వెనిజులాలో సొంత నిర్ణయంతో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా లాంటి దేశాల్లో అనవసర యుద్ధాలు చేసి నష్టపోయాం. అయినా మన అధ్యక్షుడు మాత్రం ఇంకా సైనికవాదానికే మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగాలు, వైద్యం, విద్యపై పెట్టాల్సిన ఖర్చును విదేశాలపై దాడులకు తగలేస్తున్నారంటూ రో ఖన్నా మండిపడ్డారు. రో ఖన్నా మాత్రమే కాదు.. డెమొక్రాట్ నేతలు పలువురు ట్రంప్ చర్యను తప్పుబట్టారు.
Donald Trump betrayed his MAGA base today launching a war of choice to bring regime change in Venezuela.
We keep voting against dumb wars in Iraq, Afghanistan, & Libya.
But our Presidents bow to a foreign policy blob committed to militarism. They get us entangled in conflicts…
— Ro Khanna (@RoKhanna) January 3, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






