త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NYTTA | న్యూయార్క్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

NYTTA | న్యూయార్క్ లోని అస‌మాయి ఆల‌య ప్రాంగ‌ణంలో వినాయ‌క చవితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో నిర్వ‌హించిన వేడుక‌ల‌కు భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. తెలుగు సంస్కృతి ఉట్టిప‌డేలా వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

S

International | Published On Sep 22, 2026, 3.43 pm IST

NYTTA | న్యూయార్క్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు
Advertisement

ఆకట్టుకున్న చిన్నారుల పూజా కార్యక్రమం

NYTTA | త్రినేత్ర‌.న్యూస్ : న్యూయార్క్ లోని అస‌మాయి ఆల‌య ప్రాంగ‌ణంలో వినాయ‌క చవితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో నిర్వ‌హించిన వేడుక‌ల‌కు భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. తెలుగు సంస్కృతి ఉట్టిప‌డేలా వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

గ‌ణ‌నాథుడికి చిన్నారులు నిర్వ‌హించిన పూజా కార్య‌క్ర‌మం భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. లంబోద‌రుడి పాట‌ల‌తో ఆల‌య ప్రాంగ‌ణం మార్మోగిపోయింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త, సంఘం శ్రేయోభిలాషి డా. పైళ్ల మల్లారెడ్డి దంపతులు, కౌంటీ ప్రముఖులు పాల్గొని వేడుకలను తిలకించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో అధ్యక్షుడు రవీందర్ కొడెలతో పాటు కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు విశేష కృషి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తూ, పూజా, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

కార్యవర్గ సభ్యులు, ఆలయ నిర్వాహకులు, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కొడెల కృతజ్ఞతలు తెలిపారు. న్యూయార్క్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, భవిష్యత్ తరాలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలు, సనాతన సంప్రదాయాలను పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు. పూజల్లో భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తుల ఆనందోత్సాహాల మధ్య వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి.

Advertisement
Advertisement