త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రూ.2.57 కోట్లతో ధర్మపురి బస్ స్టేషన్ ఆధునీకరణ‌

Ponnam Prabhakar | జగిత్యాల జిల్లా ధర్మపురి బస్ స్టేషన్‌ (Dharmapuri Bus Station)ను రూ.2.57 కోట్లతో ఆధునీకరించే పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో క‌లిసి శ‌నివారం శంకుస్థాప‌న చేసిన‌ట్లు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) తెలిపారు.

S

Telangana | Published On Oct 25, 2026, 1.03 pm IST

Ponnam Prabhakar | రూ.2.57 కోట్లతో ధర్మపురి బస్ స్టేషన్ ఆధునీకరణ‌
Advertisement
  • గోదావ‌రి పుష్క‌రాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
  • మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డి

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: జగిత్యాల జిల్లా ధర్మపురి బస్ స్టేషన్‌ (Dharmapuri Bus Station)ను రూ.2.57 కోట్లతో ఆధునీకరించే పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో క‌లిసి శ‌నివారం శంకుస్థాప‌న చేసిన‌ట్లు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల బస్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఇప్ప‌టి నుంచే చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. అనంత‌రం అక్క‌డే నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

1993లో ప్రారంభమైన ధ‌ర్మ‌పురి బస్ స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాం. రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, గ్రానైట్ ఫ్లోరింగ్, కొత్త టాయిలెట్ బ్లాక్, సీసీ పేవ్‌మెంట్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. ధర్మపురికి బస్ డిపో ఏర్పాటు చేసేలా స్థల సేకరణ చేసి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను కోరాం. ధర్మపురి నుంచి ముంబైకి బస్సు సర్వీసు, కరీంనగర్-జగిత్యాల-ధర్మపురి మధ్య రాత్రి బస్సులు న‌డిపేందుకు కూడా చర్యలు తీసుకుంటాం.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు భూమి పూజ

అనంత‌రం తాటిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు భూమి పూజ చేశాం. రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేయనుంది.

ప్ర‌తి గ్రామానికి బ‌స్సు..

మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు 367 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేసి దాదాపు రూ.13 వేల కోట్లు మ‌హిళ‌లు ఆదా చేసుకున్నారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు చేరేలా, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సేవలను విస్తరిస్తూ, ధర్మపురి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement