త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pakistan Army | పాక్ సైన్యంపై మ‌హిళా ఫిదాయిన్ల దాడి.. ప‌లువురు మృతి

Pakistan Army | పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌రూపం దాల్చాయి. గ‌త కొన్ని రోజులుగా బ‌లూచ్ లిబ‌రేష‌న్ ఆర్మీ (Balochistan Liberation Army).. పాక్ సైన్యానికి (Pakistan army) చుక్క‌లు చూపిస్తోంది.

D

International | Published On Feb 2, 2026, 11.36 am IST

Pakistan Army | పాక్ సైన్యంపై మ‌హిళా ఫిదాయిన్ల దాడి.. ప‌లువురు మృతి
Advertisement

Pakistan Army | పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌రూపం దాల్చాయి. గ‌త కొన్ని రోజులుగా బ‌లూచ్ లిబ‌రేష‌న్ ఆర్మీ (Balochistan Liberation Army).. పాక్ సైన్యానికి (Pakistan army) చుక్క‌లు చూపిస్తోంది. వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా బ‌లూచ్ ప్రావిన్స్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీగా దాడులు జ‌రుగుతున్నాయి. ఈ ఆత్మాహుతి దాడుల్లో పాక్ సైన్యానికి కోలుకోలేని దెబ్బ‌త‌గిలింది. పాక్ సైన్యంపై ‘మహిళా ఫిదాయిన్లు’ (female suicide attackers) పంజా విసిరారు. ఈ ఆత్మాహుతి దాడిలో వంద‌లాది మంది హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు పాక్ ద‌ళాల‌పై దాడి చేసింది త‌మ విభాగానికి చెందిన ఇద్ద‌రు మ‌హిళా ఆత్మాహుతి బాంబ‌ర్లేన‌ని బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు వారి ఫొటోల‌ను కూడా విడుద‌ల చేసింది. వారిలో ఓ మ‌హిళ 24 ఏళ్ల ఆసిఫా మెంగ‌ల్‌గా గుర్తించారు. మ‌రో మ‌హిళ వివ‌రాలు తెలియ‌రాలేదు. ఈ ఘోర‌మైన దాడిలో 17 మంది పాక్ సిబ్బంది స‌హా దాదాపు 50 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది. అయితే, ఈ దాడిలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. బీఎల్ఏ, పాక్ ఆర్మీ మ‌ధ్య జ‌రిగిన ఈ భీక‌ర దాడుల్లో మొత్తం 193 మంది మ‌ర‌ణించిన‌ట్లు మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. మృతుల్లో 145 మంది రెబ‌ల్స్‌, 17 మంది పోలీసులు, 31 మంది పౌరులు ఉన్న‌ట్లు పేర్కొంటున్నాయి.

ఈ దాడుల‌కు ప్ర‌తీకారంగా.. పాకిస్థాన్ భ‌ద్ర‌తా ద‌ళాలు 40 గంట‌ల పాటూ ఉగ్ర‌వాద ఏరివేత కోసం పోరాటం ప్రారంభించిన‌ట్లు బ‌లూచిస్థాన్ ముఖ్య‌మంత్రి స‌ర్ఫ్రాజ్ బుగ్డి తెలిపారు. ఈ దాడిలో 140 మందికిపైగా ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు పేర్కొన్నారు. మ‌రోవైపు ఈ దాడుల‌పై పాక్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ స్పందించారు. ఈ దాడుల్లో మ‌హిళా బాంబ‌ర్లు పాల్గొన్న‌ట్లు తెలిపారు.

Advertisement
Advertisement