Epstein Files | మనుషుల జ్ఞాపకాలను ఎప్‌స్టీన్ చెరిపివేశాడా..? MIT ప్రముఖుడితో సంభాషణ..
Epstein Files | ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో ఎప్‌స్టీన్.. మనుషుల తాత్కాలిక జ్ఞాపకాలను (short-term memory) చెరిపివేసే టెక్నాలజీని ఉపయోగించారని ఓ ఈ-మెయిల్ సంభాషణలో ప్రస్తావనకు వచ్చినట్లు గుర్తించారు.
International | Published On Feb 20, 2026, 1.54 pm IST
Epstein Files | ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో ఎప్‌స్టీన్.. మనుషుల తాత్కాలిక జ్ఞాపకాలను (short-term memory) చెరిపివేసే టెక్నాలజీని ఉపయోగించారని ఓ ఈ-మెయిల్ సంభాషణలో ప్రస్తావనకు వచ్చినట్లు గుర్తించారు. 2014లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) ప్రముఖుడు జోయిచి ఇటోకు మధ్య ఆ విషయానికి సంబంధించి ఓ ఈ-మెయిల్ సంభాషణ జరిగినట్లు నిర్దారించారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై ప్రస్తుతం శాస్త్రీయ వర్గాలతోపాటు ప్రజల్లోనూ చర్చ మొదలైంది. నిజంగా ఆ టెక్నాలజీ ఉందా, దాన్ని ఎప్‌స్టీన్ ఉపయోగించాడా.. అని తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
ఈ-మెయిల్‌లో ఎప్‌స్టీన్‌తో ఇటో మాట్లాడుతూ.. మీరు ముందుగా చెప్పిన తాత్కాలిక జ్ఞాపకాలను చెరిపేసే టెక్నాలజీ విషయం గుర్తుంది. దాన్ని ఎక్కడ పరీక్షించారు ? ఏ ల్యాబ్‌లో ? అని ప్రశ్నించాడు. దీనికి ఎప్‌స్టీన్ సమాధానంగా.. చాలా చోట్ల జరిగింది. ట్రాన్స్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ (TMS) అనే పరికరంతో ట్రామా, అమ్నీషియా వంటి అంశాలపై దీనిపై చాలా పరిశోధన జరిగింది.. అని రిప్లై ఇచ్చాడు.
TMS అంటే ఏమిటి?
ట్రాన్స్‌క్రానియల్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ (TMS) వైద్యపరంగా ఆమోదించబడిన ఓ చికిత్సా విధానం. ముఖ్యంగా డిప్రెషన్, కొన్ని న్యూరాలజికల్ సమస్యల చికిత్సలో సాధారణ మందులకు స్పందించని రోగులకు దీనిని ఉపయోగిస్తారు. తలపై కుదుళ్ల దగ్గర ఓ పరికరాన్ని ఉంచి, మెదడులోని నిర్దిష్ట నాడీ కణాలను మాగ్నెటిక్ పల్స్‌ల ద్వారా ఉత్తేజపరుస్తారు. ఇది శస్త్రచికిత్స అవసరం లేని (non-invasive) విధానం. అయితే TMS ద్వారా తాత్కాలిక జ్ఞాపకాలను ఎంపికచేసి చెరిపేయవచ్చు అనే విషయంపై ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జ్ఞాపకాల నిర్మాణం, గుర్తుచేసుకునే ప్రక్రియలు చాలా సంక్లిష్టమైన నాడుల నెట్‌వర్క్‌లపై ఆధారపడి ఉంటాయి. ఒక్క స్విచ్ ఆన్ చేసి ఒక నిర్దిష్ట జ్ఞాపకాన్ని తొలగించే స్థాయి టెక్నాలజీ ఇప్పటికీ అందుబాటులో లేదని సైంటిస్టులు చెబుతున్నారు.
అయితే ఎప్‌స్టీన్ ప్రస్తావించిన ట్రామా, అమ్నీషియా వ్యాఖ్యలు బహుశా అప్పట్లో మెదడు జ్ఞాపకాలపై జరిగిన పరిశోధనలు అయి ఉంటాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. కానీ TMS ను జ్ఞాపకాలను డిలీట్ చేసే సాధనంగా ఉపయోగించడం సాధ్యం కాదని, అలాంటి టెక్నాలజీ ప్రస్తుతం లేదని స్పష్టం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు
ఆగస్టు 25, 2026

Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆగస్టు 2, 2026

Jupally Krishna Rao | తెలంగాణలో వైన్ తయారీ.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అవకాశాలున్నాయి
జులై 31, 2026
తాజావార్తలు
- ●TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'
- ●Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు
- ●పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం
- ●PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ..?
- ●Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్
- ●Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'

Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు

పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం

PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ..?



