Elon Musk | అంబానీపై మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు.. బీజేపీకి విరాళాలపై పోస్టులు
Elon Musk | భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శనివారం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రిలయన్స్ నిధులు అందించిన సంస్థ బీజేపీ సోషల్ మీడియా ప్రచారాలకు సహకరించిందని, రిలయన్స్‌తో సంబంధం ఉన్న మరో సంస్థ అధికార పార్టీకి భారీగా రాజకీయ విరాళాలు ఇచ్చిందని ఆరోపిస్తూ మీడియా కథనాల స్క్రీన్‌షాట్‌లను ఎక్స్‌లో పంచుకున్నారు.
International | Published On Oct 10, 2026, 4.20 pm IST
Elon Musk | భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శనివారం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రిలయన్స్ నిధులు అందించిన సంస్థ బీజేపీ సోషల్ మీడియా ప్రచారాలకు సహకరించిందని, రిలయన్స్‌తో సంబంధం ఉన్న మరో సంస్థ అధికార పార్టీకి భారీగా రాజకీయ విరాళాలు ఇచ్చిందని ఆరోపిస్తూ మీడియా కథనాల స్క్రీన్‌షాట్‌లను ఎక్స్‌లో పంచుకున్నారు. మస్క్ తాజాగా చేసిన పోస్టులో 2022లో అల్ జజీరా ప్రచురించిన హౌ ఎ రిలయన్స్-ఫండెడ్ ఫర్మ్ బూస్ట్స్ బీజేపీస్ క్యాంపెయిన్స్ ఆన్ ఫేస్‌బుక్ అనే కథనాన్ని పంచుకున్నారు. అలాగే 2024లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన క్విక్ సప్లై సంస్థకు సంబంధించిన పాత కథనాన్ని కూడా షేర్ చేశారు. రిలయన్స్‌తో సంబంధం ఉన్నట్లు పేర్కొన్న ఈ సంస్థ ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి రూ.385 కోట్లు, శివసేనకు రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఆ కథనం పేర్కొంది.
స్పందించని అంబానీ..
భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ప్రారంభంలో కొనసాగుతున్న జాప్యంపై మస్క్ ముకేశ్ అంబానీపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ తాజా పోస్టు వెలువడింది. మస్క్ చేసిన ఆరోపణలపై రిలయన్స్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. మరోవైపు దేశంలో టెలికాం, శాటిలైట్ సేవలకు సంబంధించిన అనుమతుల వ్యవస్థ న్యాయంగా, వివక్ష లేకుండా అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవస్థను ఎంపిక చేసి అమలు చేస్తున్నారనే ఆరోపణలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి అని ప్రభుత్వం పేర్కొంది. ఈ వారం ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సందర్భంగా మస్క్, అంబానీల మధ్య ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలపై జరుగుతున్న వివాదంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ స్పందించేందుకు నిరాకరించారు. భారత వినియోగదారులకు విలువను అందించడంపైనే తమ సంస్థ దృష్టి ఉందని ఆయన తెలిపారు.
అంబానీపై తీవ్ర ఆరోపణలు..
తాజా పోస్టు చేయడానికి కొన్ని గంటల ముందు మస్క్ ముకేశ్ అంబానీని ప్రధానమంత్రి అంబానీగా సంబోధిస్తూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. అంబానీ ఒక గుత్తాధిపత్యాన్ని కాపాడుతున్నారని ఆరోపించిన మస్క్, తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవను భారత మార్కెట్లో పోటీ పడేందుకు అనుమతిస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని స్పష్టం చేశారు. ఒక నిర్దిష్ట సంస్థ చుట్టూ చర్చ ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, మూడు సంస్థలు ఇప్పటికే శాట్కామ్ లైసెన్సులు పొందాయని, భద్రతా నిబంధనలు, నిర్దేశించిన దశలను పూర్తి చేసిన తర్వాత అవి సేవలు ప్రారంభించవచ్చని చెప్పారు. భారత మార్కెట్లో తన సేవలను అడ్డుకోవడానికి శక్తివంతమైన వ్యాపార ప్రయోజనాలు ప్రయత్నిస్తున్నాయని మస్క్ ఆరోపించారు. భారత ప్రజలపై తమ గుత్తాధిపత్య పట్టు కొనసాగించేందుకు కొందరు ఒలిగార్క్‌లు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.

అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేదు: మస్క్
భారత్‌లోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం లేదని మస్క్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల పిల్లలకు విద్యా అవకాశాలు, చిన్న వ్యాపారాలకు ప్రపంచ మార్కెట్‌లో తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశాలు దూరమవుతున్నాయని అన్నారు. స్టార్‌లింక్ వారి జీవితాలను మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే మస్క్ మరో పోస్టు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల సమయంలో మిగతా కమ్యూనికేషన్ వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడడంలో స్టార్‌లింక్ కీలకంగా పనిచేసిందని చెప్పారు. భారత్‌లో కూడా స్టార్‌లింక్‌కు అనుమతి ఇవ్వడం ద్వారా మహిళలు, పిల్లల ప్రాణాలను కాపాడేందుకు సహాయపడతారని అన్నారు. అయితే, భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని సింధియా స్పష్టం చేశారు.
3 కంపెనీలు వేచి చూస్తున్నాయి: సింధియా
తమ వైఖరిని స్పష్టంగా చెబుతున్నానని, టెలికమ్యూనికేషన్ల శాఖగా తాము సాంకేతికత విషయంలో తటస్థంగా ఉంటామని సింధియా అన్నారు. ప్రతి వినియోగదారుడికి సేవల సమాహారాన్ని అందించడమే తమ బాధ్యత అని, స్వేచ్ఛా మార్కెట్లో ఏ సేవను ఎంచుకోవాలో, ఆ సేవలో ఏ కంపెనీని ఎంచుకోవాలో నిర్ణయించేది వినియోగదారుడే అని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు. మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, రిలయన్స్ జియోకు చెందిన జియో శాట్కామ్, భారతి ఎయిర్‌టెల్ మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ ఇప్పటికే లైసెన్సులు పొందాయని సింధియా తెలిపారు. అమెజాన్‌కు చెందిన ప్రాజెక్ట్ కైపర్ కూడా ఆసక్తి వ్యక్తం చేసిందని, అది కూడా ఇప్పటికే ఉన్న విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. ఒక నిర్దిష్ట కంపెనీ గురించి చాలా చర్చ జరుగుతోందని, కానీ మూడు సంస్థలు శాట్కామ్ లైసెన్సులు పొందాయని సింధియా పేర్కొన్నారు.
https://twitter.com/elonmusk/status/2108717598196244828?s=20
కాంగ్రెస్ దారెటో తెలియదు..
ప్రభుత్వం తన వైఖరిపై స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. మూడు సంస్థలు లైసెన్సులు పొందాయని, ప్రభుత్వం ఆదాయ ఆధారిత ఛార్జీల విధానాన్ని నిర్ణయించిన తర్వాత వాటికి స్పెక్ట్రమ్ కేటాయిస్తుందని తెలిపారు. ఆయా సంస్థలు భద్రతా నిబంధనలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత సేవలు ప్రారంభించవచ్చని చెప్పారు. శాటిలైట్ కమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ ధరల విధానంపై ట్రాయ్, టెలికమ్యూనికేషన్ల శాఖ తుది నిర్ణయానికి చేరువలో ఉన్నాయని సింధియా తెలిపారు. రాహుల్ గాంధీ, మస్క్ మధ్య ఎక్స్‌లో జరిగిన సంభాషణ నేపథ్యంలో కాంగ్రెస్‌పై సింధియా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తాను ఎటు వెళ్తుందో, ఎడమ వైపా, కుడి వైపా తనకే స్పష్టంగా తెలియని పరిస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. ఒక నిర్దిష్ట వ్యక్తికి లైసెన్స్ రావడంపై తొలుత కాంగ్రెస్‌కు సమస్య ఉండేదని, ఇప్పుడు అదే వ్యక్తితో కలిసి, ఆయనకు లైసెన్స్ ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తోందని విమర్శించారు. వారు ఎటు వెళ్తున్నారో వారికి స్పష్టత ఉందో లేదో తనకు తెలియదని, కాంగ్రెస్ విషయంలో ఇది ఊహించదగినదే అని సింధియా అన్నారు.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ వార్షిక టెలికాం సదస్సు ఢిల్లీలో కొనసాగుతున్న సమయంలోనే మస్క్ ఈ ఆరోపణలు చేశారు. అంతకుముందు ఎక్స్‌లో చేసిన మరో పోస్టులో, స్టార్‌లింక్ ఇప్పటికే 165కిపైగా దేశాల్లో లైసెన్స్ పొందిందని, భారత ప్రభుత్వంలోని ప్రతి చట్టం, నిబంధనను పాటించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇంకా లైసెన్స్ ఎందుకు రాలేదు? అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Chirumilla Rakesh | నీకున్న రోగానికి అల్లోపతి వడ్తలేదట.. ఇగో కాయ కచోరి వటు
- ●BC Reservations | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు ఖరారు
- ●Hero Aadi | యూట్యూబర్‌కు ఉన్న మార్కెట్ నీకు లేదు - ట్రోల్స్‌పై టాలీవుడ్ హీరో రియాక్షన్
- ●RBI | చమురు కంపెనీలకు ఆర్బీఐ బిగ్‌న్యూస్.. స్పెషల్‌గా డాలర్ విండో
- ●Janasena Ministers | ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు జనసేన మంత్రులు డుమ్మా..!
- ●Maharashtra Tapi River Incident | కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి తాళం.. నదిలో నవ దంపతుల శవాలు: అసలేం జరిగింది?

Chirumilla Rakesh | నీకున్న రోగానికి అల్లోపతి వడ్తలేదట.. ఇగో కాయ కచోరి వటు

BC Reservations | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు ఖరారు

Hero Aadi | యూట్యూబర్‌కు ఉన్న మార్కెట్ నీకు లేదు - ట్రోల్స్‌పై టాలీవుడ్ హీరో రియాక్షన్

RBI | చమురు కంపెనీలకు ఆర్బీఐ బిగ్‌న్యూస్.. స్పెషల్‌గా డాలర్ విండో






