Donald Trump | ఈయూ దేశాలపై గ్రీన్‌లాండ్ టారీఫ్‌లు.. వెనక్కి తగ్గిన ట్రంప్
Donald Trump | గ్రీన్‌లాండ్ టారీఫ్‌ల (Greenland Tariff Threat) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యూటర్న్ తీసుకున్నారు. ఈయూ (EU) దేశాలపై అదనపు సుంకాలను (Tariffs) వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
International | Published On Jan 22, 2026, 10.57 am IST
త్రినేత్ర.న్యూస్: గ్రీన్‌లాండ్ టారీఫ్‌ల (Greenland Tariff Threat) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యూటర్న్ తీసుకున్నారు. ఈయూ (EU) దేశాలపై అదనపు సుంకాలను (Tariffs) వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో (Mark Rutte) సమావేశం అనంతరం ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గ్రీన్‌లాండ్ స్వాదీనం విషయంలో తమకు సహకరించని ఎనిమిది ఈయూ దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి అవి అమల్లోకి వస్తాయని చెప్పారు. అయితే తాజాగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. ‘నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో చాలా ఫలప్రదమైన చర్చలు జరిగాయి. గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తు ఒప్పందానికి ఓ ఫ్రేమ్‌వర్క్ రూపొందించాం. ఇది కార్యరూపం దాల్చితే అమెరికాతో పాటు నాటో (NATO) మిత్ర దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే సుంకాలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన సుంకాలను విధించడం లేదు. ‘గోల్డెన్ డోమ్’ నిర్మాణం పైనా చర్చలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌లు దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నారు’ అని ట్రంప్ వెల్లడించారు.
కాగా, దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో (World Economic Forum) ట్రంప్ మాట్లాడుతూ.. గ్రీన్‌లాండ్‌ను ఓ ఐస్ ముక్కగా అభివర్ణించారు. ఎలాగైనా దానిని అమెరికా సొంతం చేసుకోవాల్సిందేనని చెప్పారు. దానికోసం బలప్రయోగం (సైనిక చర్య) చేయబోమన్నారు. తాము బలప్రయోగం జరిపితే పని తేలికగా అవుతుంది. కానీ, అలా చేయబోమని, ఆ అవసరం తమకు లేదని చెప్పారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






