త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump at WEF | గ్రీన్‌లాండ్‌ను రక్షించే శక్తి అమెరికాకే ఉంది: డెన్మార్క్ కృతజ్ఞత లేని దేశం: దావోస్‌లో ట్రంప్ ధ్వజం

"గ్రీన్‌లాండ్ ఒక అందమైన మంచు ముక్క.. దానిని కాపాడటం అమెరికా వల్ల మాత్రమే సాధ్యం" అంటూ దావోస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ తన 'అమెరికా ఫస్ట్' విధానాన్ని మరోసారి చాటిచెప్పారు. యూరప్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ గ్రీన్‌లాండ్ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

J

International | Published On Jan 21, 2026, 8.27 pm IST

Donald Trump at WEF | గ్రీన్‌లాండ్‌ను రక్షించే శక్తి అమెరికాకే ఉంది: డెన్మార్క్ కృతజ్ఞత లేని దేశం: దావోస్‌లో ట్రంప్ ధ్వజం

సంక్షిప్త సారాంశం

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రసంగం చేశారు. గ్రీన్‌లాండ్‌ను రక్షించే సామర్థ్యం కేవలం అమెరికాకు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్‌కు తిరిగి ఇచ్చి అమెరికా తప్పు చేసిందని, అందుకు ప్రతిగా డెన్మార్క్ కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తోందని ట్రంప్ విమర్శించారు.

Advertisement

Donald Trump at WEF | త్రినేత్ర.న్యూస్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. ప్రపంచ దేశాల అంచనాలకు తగ్గట్టుగానే 'అమెరికా ఫస్ట్' (America First) నినాదాన్ని వినిపిస్తూ, గ్రీన్‌లాండ్ విషయంలో తన పట్టును ఏమాత్రం సడలించలేదు.

యూరప్‌పై విమర్శల బాణాలు

తన ప్రసంగం ప్రారంభంలోనే అక్కడికి విచ్చేసిన వ్యాపారవేత్తలు, స్నేహితులు, "కొందరు శత్రువుల‌కు" స్వాగతం పలుకుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికా తన హయాంలో అద్భుతమైన పురోగతి సాధిస్తుందని చెప్తూనే, యూరప్ సరైన దిశలో పయనించడం లేదని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.

గ్రీన్‌లాండ్ అంశంపై సంచలనం

గ్రీన్‌లాండ్ గురించి ప్రస్తావిస్తూ.. "అదొక పెద్ద, అందమైన మంచు ముక్క" అని అభివర్ణించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్‌కు తిరిగి అప్పగించడం అమెరికా చేసిన "తెలివితక్కువ పని" అని ఆయన వ్యాఖ్యానించారు. అంత చేసినా డెన్మార్క్ కనీసం కృతజ్ఞత కూడా చూపడం లేదని మండిపడ్డారు.

"గ్రీన్‌లాండ్ గురించి నేను మాట్లాడకూడదని అనుకున్నాను, కానీ మాట్లాడకపోతే నన్ను విమర్శిస్తారు" అని చమత్కరించడంతో సదస్సులో నవ్వులు పూశాయి. అయితే, గ్రీన్‌లాండ్ ప్రజలు, డెన్మార్క్ అంటే తనకు గౌరవం ఉందని చెబుతూనే, ఆ ప్రాంతానికి భద్రత కల్పించే శక్తి ఏ ఇతర దేశానికీ లేదని, కేవలం అమెరికా మాత్రమే ఆ పని చేయగలదని ధీమా వ్యక్తం చేశారు.

అమెరికా ఒక గొప్ప శక్తి అని, ప్రజలు ఊహించిన దానికంటే అది చాలా శక్తివంతమైనదని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి అమెరికా సైన్యం చేపట్టిన మెరుపు దాడిని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలను ఈ వేదిక ద్వారా ఆయన ప్రపంచ దేశాలకు పంపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement