Donald Trump | క్యూబాను స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన
Donald Trump | తాను శాంతి కాముకుడినని, ఇప్పటివరకు 10-12 యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో దేశంపై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఇరాన్‌తో యుద్ధంతో తల బొప్పికట్టించుకున్న ట్రంప్.. తాజా క్యూబాపై (Cuba) ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
International | Published On May 2, 2026, 8.52 am IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్: తాను శాంతి కాముకుడిని, ఇప్పటివరకు పది, పన్నెండు యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో దేశంపై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఇరాన్‌తో యుద్ధంతో తల బొప్పికట్టించుకున్న ట్రంప్.. తాజా క్యూబాపై (Cuba) ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పారు. అమెరికా సైన్యం ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలోనే ఈ ఆపరేషన్‌ను ముగిస్తుందని చెప్పారు. క్యూబా నాయకత్వం లొంగిపోవాల్సిందేనని అల్టిమేటం జారీచేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని వైట్‌హౌస్ ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఫ్లోరిడాలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ‘ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నాం. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటాం. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలోనే మా సైన్యం ఆ పని చేయబోతోంది. అబ్రహం లింకన్ యుద్ధ నౌకను ఆ దేశానికి 100 గజాల దూరంలో ఆపుతాం. మేం లొంగిపోతున్నాం అని క్యూబా చెప్పేలా చేస్తాం’ అని చెప్పారు.
గతంలో వెనెజువెలాపై..
ఈ ఏడాది జనవరిలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే వెనెజువెలాపై అమెరికా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దేశం సైనిక స్థావరాలు, జనావాసాలపై భారీ స్థాయిలో క్షిపణులు, రాకెట్లతో దాడులకు పాల్పడింది. రాజధాని కారకాస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఆ దేశ అధ్యక్షుడు నికొలస్ మదురో సహా ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను బంధించిన అమెరికా సైన్యం.. వారిని అమెరికాకు తరలించింది. ఆ సమయంలోనే ‘క్యూబా నెక్ట్స్..’ అంటూ ట్రంప్ ప్రకటించారు. అదొక ఒక విఫల దేశమని, దాని దగ్గర డబ్బు లేదు, చమురు లేదని ఎద్దేవా చేశారు. కానీ అదో అందమైన ద్వీపం, దానిని స్వాధీనం చేసుకోవడం తనకు గౌరవం అని వ్యాఖ్యానించారు.
అమెరికా మాకు ఆదేశాలివ్వడం ఏంది?
కాగా, ట్రంప్ అల్టిమేటంపై క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ స్పందించారు. తమది ఓ స్వతంత్ర దేశమని, అలాంటప్పుడు అమెరికా మాకు ఆదేశాలివ్వడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఎట్టిపరిస్థితిలో లొంగిపోనని, రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. తమ దేశ నాయకత్వాన్ని నిర్ణయించేది ఇక్కడి ప్రజలే నని అధ్యక్షుడు మిగెల్ చెప్పారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






