త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ప్ర‌తీకార దాడులు చేస్తే తీవ్ర ప‌రిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చ‌రిక‌లు..

Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు ఇరాన్‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ మృతి అనంతరం అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఆ దేశ ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు చేసిన నేప‌థ్యంలో ట్రంప్ స్పందించారు.

S

International | Published On Mar 1, 2026, 1.02 pm IST

Donald Trump | ప్ర‌తీకార దాడులు చేస్తే తీవ్ర ప‌రిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చ‌రిక‌లు..
Advertisement

Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు ఇరాన్‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ మృతి అనంతరం అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఆ దేశ ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు చేసిన నేప‌థ్యంలో ట్రంప్ స్పందించారు. ఇరాన్ ప్ర‌తీకారానికి దిగ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని అన్నారు. ప్ర‌తిదాడులు చేస్తే ప‌రిణామాలు మ‌రింత తీవ్రంగా ఉంటాయ‌ని, ఈసారి ఊహించ‌ని రీతిలో దాడులు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇరాన్ ప్ర‌తిదాడుల‌కు పాల్ప‌డితే త‌మ నుంచి ఈసారి స్పంద‌న మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని, చ‌రిత్ర‌లో ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు ఉప‌యోగించ‌ని విధంగా భారీ ఎత్తున సైన్యంతో దాడుల‌కు పాల్ప‌డుతామ‌ని అన్నారు. ఈ మేర‌కు ట్రంప్ త‌న ట్రూత్ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు.

అంత‌కు ముందు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ), ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆర్మీ త‌మ నాయ‌కుడి మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని, వారు ఖ‌మేనీ మృతికి మూల్యం చెల్లించుకోవాల్సిందేన‌ని ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి. అమెరికా చ‌ర్య‌లు హ‌ద్దు మీరాయ‌ని, వారు అత్యంత క్రూరులుగా మారార‌ని, చ‌రిత్ర‌లో ఇలాంటి హేయ‌మైన చ‌ర్య‌ను ఎన్న‌డూ చూడ‌లేద‌ని పేర్కొన్నాయి. ఖ‌మేనీ చూపిన బాట‌లోనే తాము న‌డుస్తామ‌ని స్ప‌ష్టం చేశాయి.

కాగా ఖ‌మేనీ హ‌త్య‌కు నిర‌స‌న‌గా ఆదివారం ఉద‌యం ఇరాన్ ప్ర‌తీకార దాడులు చేప‌ట్టింది. గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావ‌రాలే లక్ష్యంగా ఇరాన్ దాడుల‌ను ప్రారంభించింది. దీంతో స్పందించిన అమెరికా ఆ దాడుల‌ను తిప్పికొట్టింది.

Advertisement
Advertisement