త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | వైట్‌హౌస్ క‌ర‌స్పాండెంట్ డిన్న‌ర్‌లో కాల్పులు.. తృటిలో త‌ప్పించుకున్న డొనాల్డ్ ట్రంప్‌

Donald Trump | అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్​హౌస్​ (White House) స‌మీపంలో కాల్పుల కలకలం సృష్టించాయి. వాషింగ్ట‌న్ హిల్ట‌న్ హోట‌ల్‌లో నిర్వ‌హించిన వైట్‌హౌస్ క‌రెస్పాండెంట్స్ డిన్న‌ర్ మీట్‌లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తి కాల్పులు జ‌రిపాడు.

G

International | Published On Apr 26, 2026, 7.58 am IST

Donald Trump | వైట్‌హౌస్ క‌ర‌స్పాండెంట్ డిన్న‌ర్‌లో కాల్పులు.. తృటిలో త‌ప్పించుకున్న డొనాల్డ్ ట్రంప్‌
Advertisement

Donald Trump | త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్​హౌస్​ (White House) స‌మీపంలో కాల్పుల కలకలం సృష్టించాయి. వాషింగ్ట‌న్ హిల్ట‌న్ హోట‌ల్‌లో నిర్వ‌హించిన వైట్‌హౌస్ క‌రెస్పాండెంట్స్ డిన్న‌ర్ మీట్‌లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తి కాల్పులు జ‌రిపాడు. ఈ ఘటనలో అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump), ఫ‌స్ట్ లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump), జేడీ వాన్స్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ట్రంప్‌ సహా కీలక నేతలను అక్క‌డినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సుమారు 2600 మందికిపైగా అథితులు హాజ‌రైన ఈ విందులో ఒక్క‌సారిగా కాల్పుల శ‌బ్ధం వినిపించ‌డంతో ఉద్రిక్తత నెలకొంది. అంతా భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. ప్రాణ భయంతో వణికిపోయారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. హోట‌ల్‌ను పూర్తిగా త‌మ ఆధీనంలో తీసుకున్నారు. కాగా, దుండగుడు దాదాపు 7 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


కాల్పుల ఘ‌ట‌న‌పై ట్రంప్ స్పందిస్తూ.. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ చాలా అద్భుతంగా గడిచింది. భ‌ద్ర‌తా సిబ్బంది అద్భుతంగా ప‌నిచేశారు. వారు వేగంగా, ధైర్యంగా స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు, కార్యక్రమాన్ని కొనసాగిద్దాం అని నేను సిఫార్సు చేశాను. కానీ అది పూర్తిగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకత్వంలోనే జరుగుతుంది. వారు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంతో సంబంధం లేకుండా, ఈ సాయంత్రం అనుకున్నదానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. మనం దీన్ని మళ్ళీ నిర్వహించాల్సిందే అని త‌న ట్రూత్ సోష‌ల్‌లో పోస్ట్ చేశారు.

కాగా, 2024 ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా కూడా ట్రంప్‌పై కాల్పులు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో ఆయ‌న తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. 2024, జూలై 13న పెన్సిల్వేనియాలోని బ‌ట్ల‌ర్ ప్రాంతంలో రిప‌బ్లిక‌న్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ట్రంప్ ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న స‌భికుల‌ను ఉద్దేశించి మాట్లాడుతుండ‌గా దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. అయితే బుల్లెట్ చెవిని తాకుతూ వెళ్లింది. ఆ కాల్పుల్లో ఒక ప్రేక్షకుడు మరణించగా, ట్రంప్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అనంత‌రం భ‌ద్ర‌తా సిబ్బంది కాల్పుల్లో నిందితుడు హ‌త‌మ‌య్యాడు.

 

Advertisement
Advertisement