Donald Trump | ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. దాడులపై వెనక్కి తగ్గిన ట్రంప్
Donald Trump | ఈ రాత్రి ఇరాన్‌కు కాలరాత్రే.. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకమని, ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతమవుతుందని బీరాలు పోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తగ్గారు. ఇరాన్‌పై (Iran) దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించారు.
International | Published On Apr 8, 2026, 5.53 am IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్: ఈ రాత్రి ఇరాన్‌కు కాలరాత్రే.. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకమని, ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతమవుతుందని బీరాలు పోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తగ్గారు. ఇరాన్‌పై (Iran) దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తెరిచేందుకు మరో రెండు వారాలు గడువు ఇచ్చారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను అంగీకరించిన ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు.
‘పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో మాట్లాడాను. ఇరాన్‌కు ఇచ్చిన గడువును రెండు వారాలపాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని కోరారు. హర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు (Ceasefire) అంగీకరించాను. ఇరుదేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుంది. ఇరాన్ పది సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించింది. అవన్నీ సానుకూలంగానే ఉన్నాయి. దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఆ దేశంతో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుంది. ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నా. 14 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే మళ్లీ దాడులు చేస్తాం’ అని ట్రంప్ అందులో రాసుకొచ్చారు.’ ట్రంప్ అందులో రాసుకొచ్చారు. కాగా, తాజా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. ఇరాన్‌పై రెండు వారాల పాటు సైనిక చర్యను నిలిపివేయనుంది.
ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతం..
ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకమని, ఈ రాత్రితో ఇరాన్‌లో 47 ఏళ్ల అవినీతి, అరాచకం పాలన అంతంకానుందని అంటూ ట్రంప్ ఘాటు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసేందే. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అంతేస్థాయిలో ప్రతిస్పందించింది. అమెరికా, దాని మిత్రదేశాలే పురాతన నాగరికత కలిగిన ఇరాన్ నుంచి మరిచిపోలేని దెబ్బను రుచి చూస్తారంటూ హెచ్చరించింది. అమెరికాను ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. 15వేల క్షిపణులు, 45వేల డ్రోన్లతో తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






