Donald Trump | ట్రంప్ తగ్గేదేలే.. ప్రపంచ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు..
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతులపై అదనంగా 10 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు.
International | Published On Feb 21, 2026, 7.02 am IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతులపై అదనంగా 10 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని చెప్పారు. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఓవల్ ఆఫీస్‌లో ఈ కొత్త ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ దేశానికి మేలు చేసే ధైర్యం కొందరు న్యాయమూర్తులకు లేదని తనకు సిగ్గుగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
టారిఫ్‌లు సరైనవే: ట‌్రంప్
అమెరికాను రక్షిండం కోసం ప్రపంచ దేశాలపై టారిఫ్‌లను విధించడం సరైన చర్యే అని ట్రంప్ సమర్థించుకున్నారు. న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు తనను తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురి చేసిందన్నారు. అమెరికా ప్రతిపక్ష డెమొక్రాట్ల చేతిలో జడ్జిలు కీలు బొమ్మలుగా మారారని, జడ్జిలను డెమొక్రాట్లు మూర్ఖులుగా భావిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. డెమొక్రాట్లకు దేశం పట్ల భక్తి, రాజ్యాంగంపై నమ్మకం లేవని అన్నారు. సుప్రీం కోర్టు జడ్జిలు విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యారని అన్నారు. తాను ఎన్నో మిలియన్ల ఓట్లతో గెలిచానని, ట్రంప్ పేరు వింటేనే జడ్జిలకు భయమని పేర్కొన్నారు. తన పనిని తాను సక్రమంగా చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. టారిఫ్ లను తొలగించడం ఎవరి వల్లా కాదని, తాను మళ్లీ సుంకాలను విధిస్తానని అన్నారు. 1974 ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 122 ప్రకారం ప్రపంచ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
భారత్‌పై 10 శాతం ప్రభావం లేదు..
ప్రపంచ దేశాలపై తాను విధించిన 10 శాతం అదనపు టారిఫ్ భారత్‌పై మాత్రం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తాము ఇప్పటికే ఇండియాతో డీల్ కుదుర్చుకున్నామని, ఇండియా 18 శాతం టారిఫ్‌ను చెల్లిస్తుందని, తాము ఎలాంటి టారిఫ్‌లను చెల్లించడం లేదని అన్నారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి. ఆయన ఇతర దేశాల కన్నా చాలా తెలివైన వారు. అమెరికాకు వ్యతిరేకంగా ఏ పని చేయరు. మేం ఇప్పటికే ఇండియాతో డీల్ కుదుర్చుకున్నాం. వారు మాకు టారిఫ్‌లను చెల్లిస్తున్నారు. మేం చెల్లించడం లేదు.. అని ట్రంప్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






