Trump Tariffs | మరో దేశంపై ట్రంప్ టారిఫ్‌ల మోత.. దక్షిణ కొరియాపై 25 శాతం సుంకాలు
Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంచ దేశాలపై సుంకాల (Tariffs) మోత మోగిస్తూనే ఉన్నారు. గ్రీన్‌లాండ్వి షయంలో యూరోపియన్ యూనియన్ దేశాలపై 10 శాతం సుంకాలు (Trump Tariffs) విధించిన ట్రంప్.. వాటిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో దేశంపై తన టారీఫ్‌లతో విరుచుకుపడ్డారు.
International | Published On Jan 27, 2026, 8.48 am IST
త్రినేత్ర.న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంచ దేశాలపై సుంకాల (Tariffs) మోత మోగిస్తూనే ఉన్నారు. గ్రీన్‌లాండ్ స్వాధీనం విషయంలో యూరోపియన్ యూనియన్ దేశాలపై 10 శాతం సుంకాలు (Trump Tariffs) విధించిన ట్రంప్.. వాటిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో దేశంపై తన టారీఫ్‌లతో విరుచుకుపడ్డారు. దక్షిణ కొరియా (South Korea) నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
గతేడాది ఆమోదించిన వాణిజ్య ఒప్పందానికి ఆ దేశ పార్లమెంట్ ఇప్పటికీ ఆమోదం తెలపకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించారు. ఆ దేశం నుంచి దక్షిణ కొరియా నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్, కలప, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులపై టారిఫ్‌లను 25 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు.
అమెరికాకు వాణిజ్య ఒప్పందాలు చాలా ముఖ్యమైనవి. తాము కుదుర్చుకున్న ప్రతి ఒప్పందంలోనూ, అంగీకరించిన లావాదేవీ ప్రకారం సుంకాలను తగ్గించాం. అదే విధంగా తమ వాణిజ్య భాగస్వాములు కూడా వ్యవహరిస్తారని తాము ఆశిస్తున్నాం. దక్షిణ కొరియా పార్లమెంట్ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండటం లేదు. గతేడాది జూలై 30న అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌తో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ఒక గొప్ప ఒప్పందాన్ని తాను కుదుర్చుకున్నాను. అక్టోబర్ 29న కొరియా పర్యటన సందర్భంగా తాను చెప్పిన అంశాలను అక్కడి పార్లమెంట్ ఇంకా ఆమోదించలేదు. ఇది వారి విచక్షణకు సంబంధించిన విషయం. దీనికి ప్రతిచర్యగా తాను ఆటోలు, కలప, ఫార్మా సహా అన్ని ఇతర వస్తువులపై సుంకాలను 15 శాతం నుంచి 25 శాతాని పెంచుతున్నట్లు ట్రంప్ అందులో వెల్లడించారు.
కాగా, అమెరికాకు ప్రధాన వ్యాపార భాగస్వామిగా ఉన్న దక్షిణ కొరియాపై ట్రంప్ గత ఆగస్టులో టారీఫ్‌లను 25 శాతాని పెంచారు. అయితే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాడానికి ఆ దేశం ముందుకు రావడంతో దిగుమతి సుంకాలను 15 శాతానికి పరిమితం చేసింది. అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా, ఇప్పుడు మళ్లీ అమలులోకి తెచ్చారు. గతంలో కెనడాపై 10 శాతం, గ్రీన్‌లాండ్ విషయంలో యూరప్ దేశాలపై, ఇటీవల కెనడాపై 100 శాతం టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






