Donald Trump | మరో పది రోజులు.. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడుల గడువును పొడిగించిన ట్రంప్
Donald Trump | ఇరాన్ (Iran) ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. దాడుల (Strikes) గడువును మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
International | Published On Mar 27, 2026, 8.07 am IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్: ఇరాన్ (Iran) ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. దాడుల (Strikes) గడువును మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు ఆశాజనకంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు, శాంతి చర్చలకు మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో గడువును ఏప్రిల్ 6న రాత్రి 8 గంటల వరకు దాడులు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు.

హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) 48 గంటల్లోగా తెరవాలని, లేదంటే విద్యుత్ కేంద్రాలపై దాడులు (Energy Infrastructure) చేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంలో వెనక్కితగ్గిన ఆయన ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ దాడుల నిలిపివేతను మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా మీడియాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో చర్చలు విఫలమవుతున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అవి 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేశారు. మరోవైపు ఇరాన్‌పై భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతున్నది. వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






