Donald Trump | ఆంథ్రోపిక్‌ను బ్యాన్ చేసిన ట్రంప్.. సప్లై చెయిన్ రిస్క్ గా గుర్తింపు..
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు అన్నీ వెంటనే ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ సాంకేతికతను వాడడాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ మోడల్‌కు పూర్తి స్థాయిలో యాక్సెస్ కావాలని పెంటగాన్ కోరిన నేపథ్యంలో ఆంథ్రోపిక్ ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది.
International | Published On Feb 28, 2026, 10.25 am IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు అన్నీ వెంటనే ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ సాంకేతికతను వాడడాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ మోడల్‌కు పూర్తి స్థాయిలో యాక్సెస్ కావాలని పెంటగాన్ కోరిన నేపథ్యంలో ఆంథ్రోపిక్ ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ అసలు ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐని ప్రభుత్వ కార్యకలాపాల్లో, ముఖ్యంగా కీలకమైన సైనిక, గూఢచారి వ్యవహారాల్లో అసలు వాడకూడదని, 6 నెలల్లోగా ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్‌ను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.
సప్లై చెయిన్ రిస్క్‌గా గుర్తింపు..
ఈ విషయంపై అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ స్పందిస్తూ ఆంథ్రోపిక్‌ను జాతీయ భద్రతకు సప్లై చెయిన్ రిస్క్‌గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి గుర్తింపు గతంలో చైనా సంస్థ హువావే వంటి విదేశీ కంపెనీలకే వర్తించేది. కానీ ఇప్పుడు ఆంథ్రోపిక్ ను ఇందులో చేర్చారు. ఈ నిర్ణయం ప్రకారం అమెరికా సైన్యంతో వ్యాపారం చేసే కాంట్రాక్టర్లు, సరఫరాదారులు ఆంథ్రోపిక్ తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకూడదు. కాగా ఈ వారం ప్రారంభంలోనే ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్‌కు హెగ్సెత్ గడువు విధించారు. పెంటగాన్‌కు క్లాడ్ ఏఐ మోడల్‌ను ఎలాంటి పరిమితులు లేకుండా వినియోగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని, లేదంటే 200 మిలియన్ డాలర్ల ప్రభుత్వ ఒప్పందాన్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఆంథ్రోపిక్ దీనిని పూర్తిగా తిరస్కరించింది. అందుకనే ట్రంప్ చర్యలకు పూనుకున్నారు.
ఇది చట్టబద్దం కాదు: ఆంథ్రోపిక్
అమెరికన్ల విస్తృత నిఘా కోసం లేదా మానవ పర్యవేక్షణ లేకుండా ప్రాణాంతక ఆటోమేటిక్ వెపన్ సిస్టమ్‌ల కోసం తమ ఏఐని ఉపయోగించరాదని ఈ సందర్భంగా ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది. అయితే అలాంటి వినియోగంపై తమకు ఆసక్తి లేదని పెంటగాన్ తెలిపింది. కానీ పూర్తిస్థాయి యాక్సెస్ కావాలని మాత్రం కోరింది. కాగా ట్రంప్ చర్యలపై ఆంథ్రోపిక్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. సప్లై చెయిన్ రిస్క్ గుర్తింపును తాము కోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపింది. అమెరికా కంపెనీపై ఇలాంటి ట్యాగ్‌ను ప్రజాస్వామ్య చరిత్రలో తాము ఎన్నడూ చూడలేదని, ఇది చట్టబద్దం కాదని పేర్కొంది. అయితే ఈ నిర్ణయం అమలులోకి వచ్చినా అది కేవలం అమెరికా రక్షణ శాఖ ఒప్పందాలకు మాత్రమే వర్తిస్తుందని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది. ఇతర వాణిజ్య వినియోగదారులు లేదా ఏపీఐ యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలియజేసింది.
ఓపెన్ఏఐ, గూగుల్ మద్దతు..
న్యాయ నిపుణులు కూడా ఈ సమస్యపై స్పందించారు. ఇది ఒక సాధారణ ఒప్పంద వివాదమేనని, జాతీయ భద్రత ముప్పుగా గుర్తించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపుఈ విషయంలో ఆంథ్రోపిక్‌కు ఓపెన్ఏఐ కూడా మద్దతుగా నిలిచింది. సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఆంథ్రోపిక్ విధించిన పలు రెడ్ లైన్స్‌కు మద్దతు పలికారు. దాదాపు 70 మంది ఓపెన్ఏఐ ఉద్యోగులు, 175 మంది గూగుల్ సిబ్బంది కూడా ఓపెన్ లెటర్ ద్వారా ఆంథ్రోపిక్‌కు సపోర్ట్‌గా నిలిచారు. అయితే ఆంథ్రోపిక్‌కు అమెరికా ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన అనంతరం ఓపెన్ఏఐ పెంటగాన్‌తో వేరే ఒప్పందం కుదర్చుకోవడం గమనార్హం. భద్రతా పరిమితులతో కూడిన విధానంలో మోడల్స్‌ను క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లలో అమలు చేయనున్నట్లు తెలిపారు.
అమెరికా మిలిటరీ, సీక్రెట్ సర్వీసెస్‌పై ప్రభావం..?
అమెరికా ప్రభుత్వం 2024 జూన్‌లోనే ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ మోడల్‌ను పలు ప్రభుత్వ రహస్య నెట్‌వర్క్‌లలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ విషయంలో తొలి ఫ్రాంటియర్ ఏఐ వ్యవస్థగా క్లాడ్ ఏఐ నిలిచింది. అమెరికాకు చెందిన సీఐఏ, ఎన్ఎస్ఏ వంటి గూఢచారి సంస్థలు ఇంటెలిజెన్స్ విశ్లేషణకు క్లాడ్ ఏఐ మోడల్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే దీన్ని తొలగించాల్సి వస్తే ఇప్పటికే కొనసాగుతున్న మిలిటరీ, సీక్రెట్ సర్వీస్ ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంథ్రోపిక్ పై ట్రంప్ చేపడుతున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






