America Iran War | ముగిసిన అమెరికా, ఇరాన్ యుద్ధం.. ఒప్పందపై ట్రంప్, పెజెష్కియాన్ సంతకం
America Iran War | గత మూడు నెలలుగా సాగుతున్న ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం (America Iran War) ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) డిజిటల్‌గా సంతకాలు చేశారు.
International | Published On Jun 18, 2026, 7.09 am IST
America Iran War | త్రినేత్ర.న్యూస్: గత మూడు నెలలుగా సాగుతున్న ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం (America Iran War) ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) డిజిటల్‌గా సంతకాలు చేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు. 60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. ఇకపై ఇరు దేశాలు ఒకదాని అంతర్గత వ్యవహారాల్లో మరొకటి జోక్యం చేసుకోకూడదని అంగీకరించారు. వీటితో సహా ఒప్పంద పత్రంలో పొందుపరచిన 14 కీలక అంశాలను అమెరికా విడుదల చేసింది. దీనికి `ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ అమెరికా అండ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్` అని పేరు పెట్టారు.
ఒప్పందంలోని 14 అంశాలు..
- ఇరాన్, అమెరికా అనుబంధ బలగాలు పాల్గొంటున్న అన్ని యుద్ధ చర్యలను వెంటనే నిలిపివేయాలి. లెబనాన్‌లోని ఘర్షణలు కూడా ఇందులో భాగం.
- అమెరికా, ఇరాన్ ఒకదాని అంతర్గత వ్యవహారాల్లో మరొకటి జోక్యం చేసుకోకూదు. వారి వారి సార్వభౌమాధికారాలను గౌరవించాలి.
- 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువు పొడిగించవచ్చు.
- అమెరికా 30 రోజుల్లో హర్మూజ్ జలసంధిపై విధించిన నౌకాదళ నిర్బంధాన్ని పూర్తిగా ఎత్తివేయాలి. తుది ఒప్పందం తర్వాత ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ కూడా ఉంటుంది.
- టోల్ లేకుండా హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతించాలి.
- ఇరాన్ ఆర్థిక పునర్నిర్మాణం కోసం ప్రాంతీయ భాగస్వాముల అండతో కనీసం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 లక్షల కోట్లు) విలువైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు అమెరికా సహకరిస్తుంది.
- తుది ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్‌పై ఉన్న అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలను తొలగించేందుకు అమెరికా అంగీకరించింది.
🚨 President Donald J. Trump has SIGNED the Iran Memorandum of Understanding at Versailles in France. 🇺🇸 pic.twitter.com/JQ6qlbvFAF
— The White House (@WhiteHouse) June 17, 2026
- ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని మరోసారి హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న అధిక సాంద్రత కలిగిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో తొలగించేందుకు అంగీకరించింది.
- తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా సైనిక మోహరింపుల విషయంలో కొత్త మార్పులు ఉండవు.
- ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మినహాయింపులు ఇస్తుంది. బ్యాంకింగ్, బీమా, రవాణా సేవలపైనా సడలింపులు ఉంటాయి.
- ఒప్పందం విజయవంతంగా అమలైతే ఇరాన్‌కు చెందిన కొన్ని విదేశీ ఆస్తులు, నిధులను విడుదల చేస్తారు.
- ఒప్పంద అమలు, భవిష్యత్ నిబంధనల పాటింపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.
- ఎంఓయూపై సంతకం అనంతరం శాశ్వత ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి.
- తుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆమోదం తీసుకుని, బైండింగ్ తీర్మానం రూపంలో అమలు చేస్తారు.
సంబంధిత వార్తలు

America Iran War | అమెరికా, ఇరాన్ యుద్ధం.. ప్రపంచ దేశాలపై ప్రభావం..
జూన్ 18, 2026

PM Modi Donald Trump | నావికుల భద్రతే మాకు ముఖ్యం.. జీ7 సమ్మిట్‌లో ట్రంప్‌కి తేల్చిచెప్పిన మోదీ.. నువ్వు దేవదూతవు అంటూ ఆకాశానికెత్తిన ట్రంప్
జూన్ 17, 2026

Donald Trump Iran Deal | మళ్లీ బాంబులు వేస్తాం.. ఇరాన్‌తో డీల్ ఇంకా ఫైనల్ కాలేదు: జీ7 సమ్మిట్‌లో డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●India-UK | జులై 15 నుంచి భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం అమలు
- ●Revanth Reddy | చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా.. చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం: సీఎం రేవంత్ రెడ్డి
- ●Keerthy Suresh | వెంకటేష్‌కు జోడీగా మహానటి - టాలీవుడ్లోకి బేబమ్మ రీఎంట్రీ - అనిల్ రావిపూడి మల్టీస్టారర్ లాంఛ్!
- ●Dharmapuri | ధర్మపురిలో విషాదం.. మహిళ ప్రాణం తీసిన కోతుల కొట్లాట
- ●Portugal vs DR Congo | పోర్చుగల్‌కు డీఆర్ కాంగో షాక్.. రొనాల్డో దారుణ ఫ్లాప్ షోపై థియరీ హెన్రీ ఫైర్!
- ●iPhone | ఐఫోన్ యూజర్లకు షాక్.. భారీగా పెరగనున్న ఫోన్ల ధరలు..?

India-UK | జులై 15 నుంచి భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం అమలు

Revanth Reddy | చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా.. చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం: సీఎం రేవంత్ రెడ్డి

Keerthy Suresh | వెంకటేష్‌కు జోడీగా మహానటి - టాలీవుడ్లోకి బేబమ్మ రీఎంట్రీ - అనిల్ రావిపూడి మల్టీస్టారర్ లాంఛ్!

Dharmapuri | ధర్మపురిలో విషాదం.. మహిళ ప్రాణం తీసిన కోతుల కొట్లాట



